సమ్మర్ లో ఐపిఎల్ ఫీవర్ తో క్రికెట్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. అయితే ఈ ఐపిఎల్ కొందరికి డబ్బు కురిపించే అస్త్రంగా మారిపోయింది. చిన్న గల్లీ నుంచి బడా బాబులకు ఒక్కటే వ్యాపారం. ప్రతి ఒక్కరు ఐపిఎల్ లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగ్ పెడుతున్నారు. ఈ బెట్టింగ్ వ్యాపారం ఒక వైరస్ లో వ్యాపించి పోయింది. కోట్ల రూపాయాల్లో బెట్టింగ్ జరుగుతుంది. ఈ బెట్టింగ్ వల్ల కొంత మంది జీవితాలు చీకట్లో కలిసి పోతున్నాయి. ఇప్పుడు అదే బాటలో మన యువ క్రికెటర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యువ ఆటగాడుతో పాటు నాలుగు ఆటగాళ్లు కూడా స్పాట్ ఫిక్సింగ్ చేస్తున్నట్లు తెలియటంతో.. రంగంలోకి పోలీసులు దిగి స్పాట్ ఫిక్సింగ్ పాల్పడిన ఆటగాళ్లు పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెటర్ శ్రీశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అతన్ని ఢిల్లీ పోలీసులు ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
శ్రీశాంత్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అంకిత్ చవాన్, అజిత్ చండీలియాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో ముగ్గురు బూకీలను అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా వీరిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు క్రికెటర్లను అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి మ్యాచ్ లో అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఏడుగురు బుకీలు వెల్లడించిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా శ్రీశాంత్, సహచర క్రికెటర్ల మీద నిఘా పెట్టిన పోలీసులు ఖచ్చితమయిన ఆధారాలు లభించాక ఈ రోజు అరెస్టులు మొదలు పెట్టారు. వేల కోట్ల రూపాయలతో ముడిపడిన టీ 20 మ్యాచ్ లలో ఫిక్సింగ్ జరుగుతుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో శ్రీశాంత్ అరెస్టు అది నిజమని తేల్చిచెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more