Telugu events dasari narayana rao at amma neeke ankitham song launch

dasari narayana rao, amma neeke ankitham, dasari narayana rao, murali mohan, amma neeke ankitham song launch, press meet, amma neeke ankitham photos, photos of amma neeke ankitham, dasari narayana rao at amma neeke ankitham song launch, murali mohan and dasari at amma neeke ankitham song launch event, amma neeke ankitham

dasari narayana rao at amma neeke ankitham song launch

అమ్మా నీకే అంకితం

Posted: 05/06/2013 10:50 AM IST
Telugu events dasari narayana rao at amma neeke ankitham song launch

అమ్మా నీకే అంకితం ’.. అంటూ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు వినిపించిన మాటలు.. ‘‘నాన్నా.. ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది కూతురు. నాన్నా .. వ్యాపారం ఎలా ఉంది అని అడుగుతాడు కొడుకు. తల్లిదండ్రుల పట్ల అభిమానం, వాత్సల్యం కూతురికే ఉంటుందని ఆయన అంటున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ, స్త్రీ పట్ల సానుకూల స్పందన ఆవశ్యకతను తెలుపుతూ తెరకెక్కిన వీడియో సాంగ్ ఆల్బమ్ 'అమ్మా నీకే అంకితం'. మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ఆల్బమ్‌ను సమర్పించింది. శంభు ప్రసాద్ స్వరపరచగా పి.యస్.నారాయణ దర్శకత్వం వహించారు. ఈ ఆల్బమ్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దాసరి నారాయణరావు విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ "ఒకప్పుడు మగువను చూస్తే తమ తల్లో, చెల్లో, కూతుర్నో గుర్తు చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. నాకాంపౌండ్ నుంచి వచ్చిన మురళీమోహన్, మోహన్‌బాబు పేదలకు సాయం చేస్తున్నారు. కళాకారులు సంపాదించినదానిలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తున్నారు.

తల్లిదండ్రుల్ని కొడుకుల కన్నా, కూతుర్లే ఆప్యాయంగా చూసుకుంటారు. నేను స్త్రీ పక్షపాతిని. అందుకే స్త్రీలకు సంబంధించి పలు సినిమాలు చేశాను. ఈ ఆల్బమ్ వల్ల ఒక్కరిలో మార్పు వచ్చినా అది సమాజాన్ని కదిలించినట్టే లెక్క. పేదలకు మా ట్రస్ట్ 'నీడ' ద్వారా చేయూతనివ్వడానికి ఎప్పుడూ ముందుంటాం'' అని అన్నారు. "నిర్భయ ఉదంతం కలచివేసింది. ఆ తర్వాత జరిగిన దుర్ఘటనలు ఇంకా వేదించడంతో ఈ ఆల్బమ్‌ను రూపొందించాను. న్యాయం, చట్టం చేయలేని పనులను ప్రజల్లో చైతన్యం కలిగించి సాధించవచ్చన్నది నా నమ్మకం'' అని పి.యస్.నారాయణ తెలిపారు. మురళీమోహన్ మాట్లాడుతూ "తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి మట్టిలోకి చేరేవరకు స్త్రీకి పలు అంశాల్లో చేదు అనుభవంలోకి వస్తూనే ఉంది. ఈ పరిస్థితిపై మార్పు రావాలని నారాయణ కాన్సెప్ట్ చెప్పగానే చేయాలనిపించింది'' అని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more