Dada saheb phhalke award goes to pran for 2013

pran actor, dada saheb phalke award 2013, filmfare awards, govt of india, padma bhhushan

dada saheb phhalke award goes to pran for 2013

ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రాణ్ కి

Posted: 04/13/2013 12:54 PM IST
Dada saheb phhalke award goes to pran for 2013

హిందీ సినిమారంగంలో అసంఖ్యాకమైన చిత్రాల్లో తనదైన శైలితో విభిన్న పాత్రలను పోషించిన 93 సంవత్సరాల ప్రాణ్ ని 2013 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసారు. 

తన సినీరంగ జీవితంలో ఎన్నో ఫిల్మ్ ఫేర్ మరి ఇతర పురస్కారాలను గ్రహించిన ప్రాణ్ కృష్ణ సికంద్ ఎంతో కాలం దుష్ట పాత్రలలో నటించి, మనోజ్ కుమార్ నిర్మించిన ఉపకార్ సినిమా నుంచి కారెక్టర్ యాక్టర్ గా స్థిరపడ్డారు.  అనుకరించలేని నటన, వైవిధ్యం, వాచకంతో హిందీ ప్రేక్షకులను అలరించిన ప్రాణ్ ప్రస్తుతం రిమేక్ లో ఉన్న జంజీర్ లో సంజయ్ దత్ వేస్తున్న పఠాన్ పాత్రను పోషించారు.  డాన్ లాంటి సినిమాల్లో హీరోతో సరితూగే పాత్రలలో జీవించిన ప్రాణ్ ని 2001 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ బిరుదుతో సత్కరంచింది. 

సినిమాల్లో రాణించటమే కాకుండా నిజజీవితంలో ప్రాణ్ ఎన్నో స్వచ్ఛంద సంస్థలలో పాలుపంచుకున్నారు.  బాంబే డైనామోస్ ఫుట్ బాల్ టీమ్ పేరుతో తనదైన ఒక ఫుట్ బాల్ బృందాన్ని ప్రాణ్ స్థాపించారు.  సినిమా పరదా మీద దయాదాక్షిణ్యాలు లేని కర్కోటకమైన దుష్ట పాత్రలలో నటించిన ప్రాణ్ కి నిజజీవితంలో అందరితో సరదాగా కలిసిపోయే గుణంతో అందరినీ ఆకట్టుకునే అలవాటుంది.

ప్రాణ్ కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించటం పట్ల సినీ ప్రముఖులంతా సంతోషాన్ని వ్యక్తం చేసారు.  దేర్ హై పర్ దురుస్త్ హై (ఆలస్యంగా చేసినా మంచిపని చేసారు) అని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more