High court questions operatives for new elec charges

రెగ్యులేటరీ అధారిటీ

Posted: 04/03/2013 03:25 PM IST
High court questions operatives for new elec charges

రెగ్యులేటరీ అధారిటీ నిర్ణయాన్ని పూర్తిగా ప్రకటించకుండా వినియోగదారులమీద కొత్త విద్యుత్ ఛార్జీలను ఎలా వేస్తారంటూ నిన్న హైకోర్టు ప్రశ్నించింది. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని, ప్రభుత్వం విద్యుదుత్వాదనలోనూ విద్యుత్సేవలోనూ విఫలమైందని, దీనివలన రాష్ట్రంలోని రెండున్నర కోట్ల విద్యుత్ వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారని హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ ఎస్.రామచంద్రరావు అన్నారు. ఉదాహరణగా ఆయన 3500 రూపాయల వేతనంతో బ్రతుకు వెళ్ళదీస్తున్న తన క్లెయింట్ ఈ పెరిగిన ఛార్జీల వలన 1100 రూపాయలను విద్యత్ కోసం వెచ్చించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఏపిఇఆర్ సి పెడచెవిని పెట్టిందని కూడా అన్నారు. దాని మీద, ఛీఫ్ జస్టిస్ ఎన్.వి.రామన్, జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ ల డివిజన్ బెంచ్ ఏపిఇఆర్ సి కి ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్వకేట్ ని ఈ విషయంలో వివరణ కోరగా, కొత్తగా పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు తీసుకోవలసిన చర్యకు సంబంధించిన భాగాన్నివిడుదల చేసారు కానీ, ఇంకా పూర్తి వివరణాత్మక ఆదేశాలను విడుదల చెయ్యలేదని, అది మరో రెండు వారాల తర్వాత విడుదలవుతుందని అన్నారు. అలాంటప్పుడు బయటకే రాని ఆర్డర్ లోని అంశాలు ఏప్రిల్ నుంచి ఎలా వర్తిస్తాయంటూ హైకోర్టు ప్రశ్నించింది. మీరనే ఆ సంపూర్ణమైన ఏపిఐఆర్ సి ఆదేశాలను సమర్పించండి అంటూ ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yerram naidu funeral
Sharmila walk to six hours  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more