పండుగ ఏదైనా, శలవు దినం కావటం వలన, పర్వదినాన భగవంతుని ఆశీస్సులు అందుకోవటం శుభకరమనే భావనవలన, సామాన్యంగా భక్తులు వారికి అనుకూలమైన విధంగా దేవాలయ సందర్శనం చేస్తారు. అందులోనూ ఇంటర్మీడియేట్ పరీక్షలు అయిపోవటంతో తిరుమలలో కొద్ది రోజులుగా రద్దీ పెరిగింది, అది ఈ రోజు ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఇంకా ఎక్కువైంది.
ప్రస్తుతమున్న పరిస్థితినిబట్టి చూస్తే, వైకుంఠం 2 క్యూ కాంప్లక్స్ లోని 31 కంపార్టు మెంట్లూ నిండిపోయి భక్తులు కాంప్లెక్స్ బయట కూడ లైన్ లో నించునివున్నారు. ఇప్పుడున్న భక్తులకు దర్శనం చేసుకోవలంటే కనీసం 18 గంటలు పడుతుంది. 300 రూపాయల టిక్కెట్టు కొనుక్కుని దర్శనం కోసం వేచివున్న భక్తులకు 8 గంటల కాలం పడుతుందని అంచనా. మెట్ల దారిలో కాలి నడకన వచ్చినవారు కూడా కనీసం 9 గంటలు వేచివుండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అంత శ్రమకోర్చి తీరా స్వామి దగ్గరకు చేరుకునేటప్పటికి దర్శనం లభించేది కొన్ని క్షణాలు మాత్రమే. అయినా భక్తులు తృప్తిపడతారు. భక్తి పారవశ్యంలో ఓలలాడుతుంటారు. స్వామివారికి కానుకలను సమర్పించుకుంటారు. ఈ కాలంలో నమ్మకం లేకపోతే, ప్రయోజనం కనిపించకపోతే ఎవరూ అంత ఖర్చు పెట్టుకుని అంత శ్రమకోర్చి శ్రీవారి దర్శనం చేసుకోరు.
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ కనుమూరి బాపిరాజు స్వామివారికి 17 లక్షల రూపాయల విలువైన కంఠహారాన్ని బహూకరించారు.
సామాన్యంగా, నేను దేవుడికి ఇంత ఇస్తున్నాను, ఆలయం నడవటానికి, ఇతర ఖర్చులకు నేను భాగస్వామ్యం వహిస్తున్నాను అని ఎవరూ అనుకోరు ముఖ్యంగా తిరుమలేశుని విషయంలో. భక్తులకు దొరికే ఆనందం కానీ పారవశ్యం కానీ వెలకట్టలేనిది. దాని ముందు వారుపడ్డ శ్రమ కానీ, చేసిన ఖర్చు కానీ చాలా తక్కువ అనిపిస్తుంది. స్వామివారి వైభవాన్ని చూసి సంతోషించేవారే ఎక్కువ మంది ఉంటారు. ఆయన ఇంకా సిరులతో వైభవంతా కానుకలందుకుంటూ ఉత్సవాలు చేసుకోవాలని కోరుకునే వారే అందరూ.
ఈ భావనను మానసిక శాస్త్రంలో నిర్వచించటానికి పూనుకోవటం అసాధ్యమైన పని. దీన్నిబట్టి మన పూర్వీకులైన ఋషులు, మునులు ఎంత ముందు ఆలోచనతో భక్తి భావన అనేదాన్ని మనలో నాటారో అని ఆలోచిస్తే వాళ్ళ అమోఘమైన ఙానం గురించి ఆలోచన వస్తే ఒళ్ళు పులకరిస్తుంది. ఈ భక్తి అనేదే లేకపోతే ఇంత వేగంగా మార్పులు చేసుకుంటున్న ప్రపంచంలో మానవుల ప్రవృత్తి ఎలా ఉండివుండేది, హింస స్వార్థాలు ఇంకా ఎంత పెరిగిపోయి వుండేవి అని ఆలోచిస్తే, మన పూర్వీకులది ఎంత ముందు చూపో అర్థమవుతుంది.
మీరు అడగక్కర్లేదు. ఆయనకి అంతా తెలుసు. మీకు ఎప్పుడు ఏది అందాలో అందుతుంది. మీ యోగ్యతను బట్టి, మీరు చేసుకున్న పుణ్యాన్నిబట్టి మీకు అన్నీ సమకూరుతాయి. ఆయన మీద నమ్మకం పెట్టుకోండి చాలు అంటూ కంటికి కనపడని దైవం గురించి ప్రబోధించి మానవులను భక్తి మార్గంలో సాత్విక సదాచార ప్రమాణాలతో జీవించే విధానాన్ని నేర్పతూ మనలో చేసిన మోటివేషన్ వలన భక్తి మార్గమూ ఇంతకాలమైనా అంతరించకుండా ఉంది, మానవులలో నిరాశా నిస్పృహలు రాకుండా, ఎవరికి వారు తమ బాధ్యతలను నెరవేర్చుకుంటూ బ్రతుకులను సాగించేందుకూ ఉపయోగపడింది. సర్వజీవులతోనూ మమేకమై భారమంతా దైవం మీద వదిలి జీవనాన్ని సాగించమని చెప్పిన దానిలో మనం ఎన్నో వంతు చేస్తున్నాం, అయినా ఎంత ప్రయోజనం చేకూరుతోంది అని ఆలోచిస్తే, నిజంగా వాళ్ళు చెప్పిన మార్గంలో నడిస్తే స్వర్గమనేది ఎక్కడో ఉండటం కాదు, భూమి మీదికే భువి దిగివస్తుందని అనిపిస్తుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more