నూరేళ్ళూ నిండిన పినాకపాణి
వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీపాద పినాకపాణి నిన్న సాయంత్రం మృతి చెందారు. 1913 ఆగస్ట్ 3 న శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో జన్మించిన పినాకపాణి వృత్తి రీత్యా వైద్యులైనా, సంగీతంలో నిష్ణాతులు.
ప్రభుత్వ వైద్యులుగా సేవలందించి ప్రజల మన్ననలందుకున్న డా.పినాకపాణి పదవీ విరమణ తర్వాత కర్నూల్ లో వైద్యరంగ బోధనలో సేవచేసారు. పేద రోగులకు ఉచిత సేవలనందించారు.
ఆయన ఎంచుకున్న మరో రంగమైన సంగీతంలో కూడా ఆయన ఎంతో ఎత్తులకు చేరుకున్నారు. ఆకాశవాణి ద్వారా సంగీత ప్రియులకు తన సంగీతాన్నందించారు. పినాకపాణి సంగీతంలో అత్యంత ఉన్నతమైన శిఖరాలను స్వయంగా అధిరోహించటమే కాక ఎందరో శిష్యులను తీర్చిదిద్ది, వారిని కూడా తనలాగా ప్రసిద్ధ కళాకారులుగా తయారు చేసి సంగీత ప్రపంచానికి ఎనలేని సేవచేసారు. కేవలం సంగీతమే కాకుండా, తనలోని యోగితత్త్వాన్ని కూడా పినాకపాణి బోధించారని, తమ జీవితాలను కూడా చక్కదిద్దారని ఆయన శిష్యులు చెప్పుకుంటారు.
ఆయన సేవలకు ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. ఎన్నో సంగీత నాటక అకాడమీల నుంచి గౌరవ పురస్కారాలను అందుకోవటమే కాక, 1966 లో కళా ప్రపూర్ణ, 1970 లో కళా శిఖామణి, 1973లో గాన కళా సాగర. 1976 లో సప్తగిరి సంగీత విద్వాన్ మణి, 1983 లో సంగీత కళానిధి బిరుదలను అందుకున్నారు. 1984 లో రాష్ట్రపతి జైల్ సింగ్ పినాకపాణి కి పద్మభూషణ బిరుదు ప్రదానం చేసారు.
1974 లో పినాకపాణిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తాన విధ్వాంసునిగా నియమించింది. అమర సంగీతం, అద్భుతమైన గాత్రం కలిగిన పినాకపాణి సంగీతానికి చేసిన 40 సంవత్సరాల కళాసేవకు గుర్తింపుగా సెంట్రల్ సంగీత నాటక అకాడమీ 1978లో ఆయన గానాన్ని రికార్డ్ చేసి నేషనల్ ఆర్కిప్స్ లో భద్రపరిచింది.
100 సంవత్సరాలు నిండిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది, తిరుమల తిరుపతి దేవస్థానం పినాకపాణిని గాన విద్యా వారధి అనే బిరుదును ప్రసాదించింది. సంగీత సౌరభం అనే శీర్షికతో పినాకపాణి రచించిన గ్రంథాలను తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించించి. కర్ణాటక సంగీతానికి పునర్జీవం కలిగించి నిలబెట్టిన అసాధారణ సంగీత విద్వాంసుడిగా పలువురు ప్రముఖులు, సంగీత ప్రియులు కొనియాడుతూ, పినకాపాణి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని, కానీ ఆయన అందించిన సంగీతం మాత్రం అమరమని అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more