Chandrababu padayatra

tdp president nara chandrababu naidu, chandrababu padayatra, starts on october 2nd from hindupur, telugu desam party, tdp, balakrishna , harishna, ysc congress party, tdp leaders jump in yscp, mla, mlc, mp, boddu bhaskara rao , mla vanitha, 2014 election, tdp government,

chandrababu padayatra

chandrababu-padayatra.gif

Posted: 02/20/2013 01:59 PM IST
Chandrababu padayatra

chandrababu_padayatra

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. 2004లో  అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ  2014 లో  అధికారంలోకి వస్తుందా? లేదా అనే దానిపై  రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ మేథావులు రకరకాలుగా చెబుతున్నారు.  63 ఏళ్ల వ్యక్తి షుగర్ ఉన్నప్పటకి .. తన పార్టీని బలోపేతం చేయటం కోసం,  ‘వస్తున్నా మీకోసం’ అంటూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారు.  చంద్రబాబు పాదయాత్ర వలన  ప్రజల నుండి మంచి స్పందన రావటంతో.. పార్టీ నాయకుల్లో కూడా  కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది.  2014 సంవత్సరంలో  పార్టీ అధికారంలోకి రావటం కోసం  చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారు. ఆయన ఇప్పటికే  రెండు  వేల కిల్లోమీటర్లు పాదయాత్ర చేసి  చరిత్ర స్రుష్టించారు. తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు ఇప్పుడు  ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నారని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజా స్పందన బాగా ఉందని వారు అంటున్నారు.  తెలంగాణ  ప్రాంతంలో కూడా  చంద్రబాబుకు మంచి ప్రజా స్పందన రావటంతో.. టీడీపీ కేడర్ లో కొత్త ఆశలు పుట్టాయి. 

Chandra-babu-padayatra-

 చంద్రబాబు  పాదయాత్ర పేరుతో  ముందుకు పోతున్న సమయంలో  పార్టీలోని నాయకులు  వెనక్కి  పోతున్నారు.  వలసలతో  టిడిపి లోని నాయకులు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే  15 మంది టిడిపి నాయకులు పార్టీ నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు, ఎంపీలు , ఎమ్మెల్యేలతో కలుపుకోని 15 మంది వెళ్లినట్లు  సమాచారం.  చంద్రబాబు మాత్రం  వేదికలు కూలిపోతున్నా.. పార్టీ నుండి వలసలు వెళ్లిపోతున్న.. అధైర్యపడకుండా.. ముందుకు సాగిపోతున్నారు.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై చంద్రబాబు  విమర్శలు చేయటంతో.. కొంతమంది నాయకులుకు  నచ్చక  పార్టీ నుండి వెళ్లిపోతున్నట్లు  సమాచారం.  టీడీపి నాయకుడి పై నమ్మకం పోయి మేము పార్టీ నుండి వెళ్లిపోతున్నాం అని  వలస నాయకులు చెబుతున్నారు. 

chandrababu-padayatra

2014లో టిడిపి పార్టీ వస్తుందో, లేదో,  మన రాజకీయ పరిస్థితి ఏమిటి, అని ఆలోచించుకోని  యువ నాయకులు డబ్బులకు  ఆశపడి, పార్టీ నియమాలను పట్టించుకోకుండా వెళ్లటం  జరుగుతున్నట్లు  రాజకీయ మేథావులు చెబుతున్నారు.  రీసెంట్ గా   బొడ్డు బాస్కర్ రామారావు పార్టీ నుండి  వెళ్లిన విషయం తెలిసిందే.  అంతేకాకుండా శ్రీకాకుళంలో ఉన్న బలమైన నాయకుడు సాయిరాజు కూడా  పార్టీని వదిలి వెళ్లటం జరిగింది. మహిళ ఎమ్మెల్యే వనిత కూడా  టిడిపి కి బాయ్  చెప్పి వెళ్లిన విషయం తెలిసిందే.  ఒక వేళ టిడిపి  అధినేత ను మార్చితే.. పరిస్థితులు మారుతాయా? అది కష్టమేనని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   బాలయ్య , హరిక్రిష్ణలకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తే,   వారిలో  రాజకీయ నేత లక్షణాలు లేవని విషయం  అందరికి తెలిసిందే.  పార్టీని  సమర్థవంతంగా నడిపించే నాయకుడు చంద్రబాబు ఒక్కడేనని  రాజకీయ మేథావులు అంటున్నారు.  అయితే 2014లో చంద్రబాబుకు,  టిడిపికి చావో రేవో తేలిపోతుందని   సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.  పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు  రాష్ట్ర ప్రజలు తమ ఓటు తో  ఏం చెబుతుతారో  ఎదురు  చూడాలి?  అప్పటి వరకు పాదయాత్రతో   సరిపెట్టుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maldieves ex president takes shelter in indian mission there
Sharmila crosses 1000 km mark in padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more