డాక్టర్ మర్రి వెంకట నరసింహారెడ్డి రచించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పుస్తకాన్ని ఈ మధ్య తిరుపతిలో జరిగిన తెలుగు మహా సభల్లో ఆవిష్కరించటం జరిగింది. అందులోని కొన్ని అంశాల మీద వీరబ్రహ్మేంద్రస్వామి భక్తులు హైద్రాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్లనుండి సంఘటితమైన భక్తులు మహాధర్నా నిర్వహిస్తూ మర్రి వెంకట నరసింహారెడ్డి స్వామివారి కాలఙానాన్ని విమర్శిస్తూ రాయటాన్ని నిరసిస్తూ, ఆ గ్రంథాన్ని నిషేధించటమే కాకుండా, అలా స్వామివారిని కించపరచి భక్తులను వేదనకు గురిచేసినందుకు గాను ఆయన డాక్టరేట్ ని ఉపసంహరించుకోవలసిందేనంటూ పట్టుబడుతున్నారు. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ దేవేందర్ గౌడ్ కూడా వారితో గొంతు కలుపుతూ, వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులే కాక బిసిలను కూడా కించపరుస్తున్న ఆ గ్రంథాన్ని వెంటనే నిషేధించాలని కోరారు.
ఓటు ని హిందీలో మత్ అంటారు. మత్ అంటే వారి ఉద్దేశ్యం, అభిప్రాయం. వారి అభిప్రాయంలో ఎవరు నాయకులవాలనేది తెలియజేసేదే ఓటు. అందుకే దాన్ని మత్ అంటారు. మతం అన్నా అదే. అభిప్రాయం. ప్రపంచం మొత్తంలో మతం విషయంలో సహనాన్ని, సంయమనం పాటించేది ఒక్క హిందూ మతమే. అలగే ఇదే మతంలోని వారు కూడా విమర్శించటానికి, వారి వారి అభిప్రాయాలను తెలియజేయటానికీ వెసులుబాటు కలిగించింది హిందూ మత బోధకులే. అందుకే ఆ మతంలో ఎన్నో గ్రంథలు, భాష్యాలు వెలువడ్డాయి. మతమనేది ఒక నమ్మకం. అది పూర్తిగా వ్యక్తిగతం. దాన్నే అందరూ నమ్మాలనేది అర్థం లేని పట్టుదల. ఆధ్యాత్మికం ఒక అవగాహన. అది ఎవరికి వారికి రావలసిందే. దాన్ని పుస్తకాలలో పొందుపరచటం, భాషలో ఇమడ్చమనేది కుదరని పని. పుస్తకాలలో ఉన్నది కేవలం మార్గం సూచిస్తుంది. ఆ మార్గంలో పయనించి ఆధ్యాత్మికపుటంచులను చేరుకోవలసింది సాధకుడే. నిజంగా నమ్మకం ఉన్నవారికి ఎవరు ఏం చెప్పినా వారి నమ్మకం సడలదు. అలా నమ్మకం తగ్గిపోతుందేమోనని భయపడేవారే ఆందోళన చెందుతారు. భూమ్మీద ఏనాడో మానవరూపంలో ఙానాన్ని ప్రభోదించిన మహాత్ములు తమ పని చేసి వెళ్ళిపోయారు. వారు చెప్పింది మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, మనం ఎంత పాటిస్తున్నామన్నది ఎవరికి వారు సరిచూసుకోవాలి కానీ, ఎదుటివారు కూడా అదే దారిలో పోతున్నారా లేదా, లేకపోతే ఎందుకు పాటించటంలేదు అని చూడటం వ్యర్థమైన ప్రయాస.
ఈ అవగాహన ఉండబట్టే హిందూ మతంలోని గ్రంథాల మీద అంత మంది అన్ని రకాలుగా వ్యాఖ్యానాలు రాసారు. రామాయణం, భారతం, భాగవతం, గీత లాంటి మహద్గంథాలను ఎందరో తమ శైలిలో వివరించారు. అన్ని భాష్యాలూ ఒకేలా ఉండవు. ఉంటే అన్ని ఎందుకు వెలువడుతాయి.
సైన్స్ లో ఎవరి అభిప్రాయాన్ని వారు ప్రకటించినట్లుగానే, పూర్వకాలంలో హిందూ గ్రంథాలు ఆ సమయంలో వచ్చిన శాస్త్రాలే కాబట్టి, వాటి మీద ఎవరినైనా స్వేచ్ఛగా మాట్లాడనిచ్చారు. అప్పట్లో వాళ్ళు శాస్త్రాలు చదివిన శాస్త్రులైతే, మిగతా మతాలలో అటువంటి విశ్లేషణలూ, వ్యాఖ్యానాలు నిషేధం కాబట్టి వాటిని అలాగే వదిలిపెట్టి, సైన్స్ అనే పేరుతో విడిగా పుస్తకాలు రాసుకుని వాటిని అభివృద్ధి చేసుకున్నారు. వారు శాస్త్రవేత్తలయ్యారు. దానిలో చెప్పినదాన్ని విఙానం అనటం మొదలుపెట్టారు. పరమత సహనాన్నే బోధించినప్పుడు, సొంత మతంలోని వారినే, వారి అభిప్రాయాలు వేరుగా ఉండటం వలన వారి ఆచార్యబిరుదుని రద్దు చెయ్యాలనటం ఎంత సమంజసం అన్నది ఎవరికి వారు నిదానంగా ఆలోచిస్తే తెలుస్తుంది.
హిందూ దేవీ దేవతల విగ్రహాలను విదేశాలలో చెప్పుల మీదా మరుగు దొడ్లలో వాడారు. హిందువులు దాన్ని తప్పు పట్టారు. అంతవరకూ సరే కానీ అలా చేసిన వారిని అది చేయాలి, ఇది చేయాలి అని అనలేదు. మనం ఏమీ మాట్లాడకపోతే చేతగాని వాళ్ళమనుకుంటారేమో అనే అభిప్రాయమే అలా నిరసనలను చేయిస్తుంది. ఎవరు ఏం చెప్పినా, ఏమి రాసినా నా హృదయంలోని నమ్మకాన్ని ఎవరూ కొల్లగొట్టలేరు కదా. మరి నాకు దేనికి వేదన.
అయితే, దీన్ని అందరూ పాటించాలి. నా అభిప్రాయం ఇది. ఇది ఇతరుల నమ్మకానికి భిన్నంగా ఉంది కాబట్టి నాలోనే దాచుకుంటాను అని అనుకుని వాటిని బహిర్గతం చెయ్యకుండా ఉండటం కూడా మంచిదే. లేదు నేను వాటిని అందరికీ చెప్పి, నేను వాళ్ళకంటే ఎక్కువ మేధావిని అని అనిపించుకోవాలనే తపన కూడా సరియైనది కాదు.
అందువలన రచయితలు కూడా పర్యవసానాలను ఆలోచించి బాధ్యతాయుతమైన రచనలు చేస్తే సమాజంలో గందరగోళానికి తావుండకుండా ఉంటుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more