ప్రముఖ నిర్మాత బండ్ల గణేస్ నివాసం, కార్యాలయం పై ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఈ వార్త హాట్ న్యూస్ గా మారింది. ఒక్కసారి బండ్ల గణేష్ పై ఐటి దాడులు జరటంపై అనేక పుకార్లు టాలీవుడ్ చౌరస్తాలో చకర్లు కొడుతున్నాయి. రెండు రోజుల సోదాల్లో దొరికిన పత్రాలను ప్రాథిమికంగా పరిశీలించిన అధికారులు రూ. 1.18 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ గా చెల్లించాలని పేర్కొంటూ సమన్లు జారీ చేశారు. పన్ను చెల్లించడానికి మార్చి వరకు గడువు ఇచ్చారు. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమాకు సబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సినీ ప్రముఖల మీద ఐటీ దాడులు జరగడం సాధారణమే. అయితే సినీ నిర్మాతలు ఎవరినీ ఇప్పటి వరకు ఐటీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించలేదని ఐటీ అధికారులు చెబుతున్నారు. భారీ స్థాయిలో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు బలమైన ఆధారలు లభించడం, సంత్రుప్తికరంగా సమాధానాలు చెప్పకపోవడం వల్లే కార్యాలయానికి తీసుకెళ్లినట్లు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఇప్పటివరకు ఒక వైపు మాత్రమే చెప్పటం జరిగింది. అసలు బండ్ల గణేష్ పై ఐటీ దాడులు జరగటానికి మరో కారణం ఉందని సినీ పెద్దలు అంటున్నారు. ఇటీవల కాలంలో డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ 44 లక్షల రూపాయల విలువ చేసే లైటర్‌ను బహుమానంగా ఇవ్వటం జరిగింది. ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. 1455 వజ్రాలు పొదిగిన ఈ లైటర్‌ను చాలా అరుదైన బహుమానంగా చెబుతున్నారు.
ఇంత విలువైన బహుమతిని పూరికి ఇవ్వడానికి గల కారణమేమిటని అడిగితే - పూరి జగన్నాథ్ గారికి ప్రజెంట్ చేసిన ఈ గిఫ్ట్ చాలా చిన్నదని తన అభిప్రాయమని, ఈ బహుమతితో పోలిస్తే పూరి జగన్నాథ్ విలువ చాలా ఎక్కువ అని బండ్ల గణేష్ తన సన్నిహితుల దగ్గర అన్నట్లు సమాచారం. పూరి బర్త్‌డేకి ఈ గిఫ్ట్ ఇవ్వాల్సిందని, అయితే ఈ లైటర్ రెడీ కావడానికి ఇంతకాలం పట్టిందని, అందుకే ఇప్పుడు ఇచ్చానని గణేష్ తన మిత్రులతో చెప్పినట్లు టాలీవుడ్ టాక్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రం విజయంతో బండ్ల గణేష్ మంచి ఊపు మీద ఉన్న విషయం అందరికి తెలిసిందే.. దీంతో సినీ పరిశ్రమలో గణేష్ అత్యంత ముఖ్యమైన నిర్మాత మారిపోవటం జరిగింది. ఈ విషయం కూడా ఐటీ అధికారుల ద్రుష్టికి వెళ్లటం వలనే గణేష్ పై ఐటీ దాడులు జరిగాయని సినీ జనాలు అనుకుంటున్నారు. మరికొంత మంది అయితే గణేష్ కు ఒక మంత్రిగారి అండ ఉందని, అందుకే ఆయన భారీ సినిమాలు చేస్తున్నాడని అనే పుకార్లు వినిపిస్తున్నాయి.
అయితే ఇదే వాస్తవం కాదని కొంతమంది సినీ పెద్దలు అంటున్నారు. మంత్రిగారితో సంబంధం ఏప్పుడో తెగిపోయిందని, కొమరం పులి సినిమాతోనే వారి సంబంధం తెగిపోయిదనే పుకార్లు వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ బినామీ అని టాలీవుడ్ లో రాజకీయ పులిహోర పంచారు. ఈ పులిహోర మాటలు ఎవరు పుట్టిస్తారో తెలియాదు గానీ, కరెక్ట్ సమయంలో పులిహౌర మాటలు పుట్టించి ప్రజల్లోకి వదులుతారు. ఇలాంటి పులిహోర మాటలకు బండ్ల గణేష్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల కోసం తనను బలి చేస్తున్నారని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరికీ బినామీని కాదని, కష్టపడి పైకి వచ్చానని అన్నారు. తనకు కుటుంబ వ్యాపారాలు ఉన్నాయని తెలిపారు. ఇకనైనా తనపై బురద జల్లడం మానుకోవాలని గణేష్ కోరారు.బండ్ల గణేష్ ట్విట్టర్‌లో స్పందించారు. రాజకీయాల కోసం తనను పావుగా ఉపయోగించుకుంటున్నారని, ఎవరికో బినామీని అని చెప్పడం సరికాదన్నారు. తనపై బురద జల్లడం మానుకోవాలని ఆయన సూచించారు. సినిమాల్లో హాస్య పాత్రలు వేస్తూ వచ్చిన బండ్ల గణేష్ నిర్మాతగా మారిపోయాడు. నిర్మాతగా ఆయన రవితేజ హీరోగా 16కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని తీశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ భారీ సినిమాలు వరుసగా నిర్మిస్తుండడమే ఐటి అధికారుల కన్ను పడడానికి కారణమని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more