Life term for killing wife

life sentence, wifes murderer, ravi kumar, vizag, krishnaveni case, auto driver, harresment, additional dowry, killed, broad daylight, court orders, krishnaveni murder, crime against women, chelluboina ravikumar, dowry harassment

Life term for killing wife.The Mahila Sessions Court here on Wednesday delivered a judgment in the case of the murder of an engineering student that created sensation, by sentencing Chelluboina Ravikumar to serve life imprisonment and levying a fine of Rs. 2,000 under Section 302 of the IPC

Ravikumar.gif

Posted: 02/14/2013 10:50 AM IST
Life term for killing wife

Life term for killing wife

చట్టం తనపని తను చేసుకుపోతుందని  అందరు చెబుతుంటారు. అది అక్షరాల రుజువుఅయ్యింది.  తప్పు చేసిన వాడు  చట్టం ముందు తప్పించుకోవటం చాలాకష్టమని తెలిసింది.  విశాఖపట్టనం నగరం నడిబొడ్డున అందరూ చూస్తుండగా, తన భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికిన భర్తకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మద్దిలపాలెం - కళాభారతి రోడ్డుపై 2011 మార్చి నాలుగో తేదీన కృష్ణవేణిని ఆమె భర్త రవికుమార్ అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. భార్యను హతమార్చిన రవికుమార్ వెంటనే విజయనగరం పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలించి పట్టుకున్నారు. అప్పట్లో ఈ ఉదంతం పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది. నడి రోడ్డుపై ఓ మహిళను హతమార్చినా, ఎవ్వరూ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. అయితే ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాధారాలతో పోలీసులు కేసును పగడ్బందీగా ఫైల్ చేయడంతో నిందితుడు రవికుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చెల్లుబోయిన రవికుమార్ మద్దిలపాలెంకు చెందిన దువ్వి కృష్ణవేణిని 2010 ఆగస్ట్ 29న వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో కృష్ణవేణి తల్లిదండ్రులు లక్షా 50 వేల రూపాయల కట్నం, ఆడబడుచులకు 20 వేల రూపాయల లాంఛనాలు ఇచ్చారు. వివాహం చేసుకునే సమయానికి కృష్ణవేణి ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలం కలిసి కాపురం చేసిన తరువాత కృష్ణవేణికి వేధింపులు ప్రారంభమయ్యాయి. కృష్ణవేణి తల్లిదండ్రులకు ఒక భవనం ఉంది. ఆ భవనంపై వచ్చే అద్దె తనకు ఇవ్వమని, దాన్ని తనకు రాసివ్వాలని, అదనపు కట్నం తేవాలని కృష్ణవేణిని భర్త రవికుమార్ వేధించడం మొదలుపెట్టాడు. అతనితోపాటు అత్త, మామలు గురమ్మ, సూర్యనారాయణ, ఆడబడుచులు శ్యామలాదేవి, ప్రసన్నకుమారి కూడా కృష్ణవేణిని వేధిస్తుండేవారు.

Life term for killing wife

2011 మార్చి నాలుగో తేదీన కృష్ణవేణి కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా, మద్దిలపాలెం-కళాభారతి రోడ్డులో కొబ్బరి బొండాలు నరికే కత్తితో రవికుమార్ ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కృష్ణవేణి తల్లిదండ్రులు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు మహిళా న్యాయ స్థానం ముందుకు వచ్చింది. న్యాయమూర్తి ఎన్.రాజా ప్రసాద్ బాబా ఇరుపక్షాల వాదనలు విన్నారు. రవికుమార్‌పై హత్యా నేరం రుజువు కావడంతో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అత్త, మామ, ఆడబడుచులకు మూడు సంవత్సరాల చొప్పున శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వీరికి శిక్షతో పాటు, ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా కూడా విధించారు. ఇది చెల్లించకపోతే, ఒక సంవత్సరం అదనంగా జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసును విచారించేందుకు న్యాయవాది ఎం గోపాలరావును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. తను కుమార్తెను దారుణంగా చంపిన హంతకుడికి న్యాయమూర్తి ఉరిశిక్ష విధిస్తారనుకుంటే యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారని కృష్ణవేణి తల్లి దువ్వి వేను కోర్టు ఆవరణలో కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు పకడ్బందీగానే కేసు నమోదు చేసినప్పటికీ, కోర్టులో సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anantha sriram chocolate love letter
Producer bandla ganesh turns emotional  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more