ప్రస్తుతం అక్కినేని వంశాంకురం నాగచైతన్యతో 'ఆటోనగర్ సూర్యా' చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు దేవా కట్టా, తన తదుపరి చిత్రానికి హీరో వెంకీని సిద్ధం చేసుకున్నాడు. ఇటీవల అల్లరి నరేష్ హీరోగా 'యముడికి మొగుడు' చిత్రం నిర్మించిన ఆర్ట్ డైరెక్టరు చంటి అడ్డాల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా, వెంకీ, దేవాల చిత్రానికి సంబంధించిన కథా చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
కాగా, సిసిఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఉత్సాహంగా బరిలోకి దిగుతున్నామని టాలీవుడ్ టీమ్ వైస్ కెప్టెన్ హీరో శ్రీకాంత్,తరుణ్ లు చెప్పారు. క్రికెట్ మ్యాచ్ కోసం శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టేడీయంలో టీమ్ సభ్యులు ప్రాక్టీస్ చేశారు.20-20 క్రికెట్ మ్యాచ్లో గెలుపు ఓటమిలు సహజమేననన్నారు. సిసిఎల్ రెండులో వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచినా సెమీస్ లో ఓడిపోయమని చెప్పారు. ఈసారి హీరో రాంచరణ్ మ్యాచ్ లో కొత్తగా ఆడనున్నాడని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఈ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) మూడవ విడత టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టుకు హీరో వెంకటేష్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. తొలుత 6 జట్లున్న ఈ లీగులో ఈసారి మరాఠీ, బోజ్ పురి జట్లు కూడా కలిశాయి. గ్రూప్-ఎ లో తెలుగు వారియర్స్ తోపాటు చెన్నై రైనోస్, కేరళ స్ట్రయికర్స్, వీర్ మరాఠీస్ ఉన్నారు. కాగా, మన జట్టు 10న బెంగాల్ టైగర్స్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. వెంకటేష్ ధరించే జెర్సీపై 1 సంఖ్య ఉండగా, రామ్ చరణ్ కు 33, తరుణ్ కు 7, శ్రీకాంత్ కు 5, నితిన్ కు 23 ఉన్నాయి.
తెలుగు వారియర్స్ జట్టు వివరాలు: వెంకటేష్ (కెప్టెన్), శ్రీకాంత్, తరుణ్, రామ్ చరణ్, నితిన్, రఘు, అజయ్, రాజీవ్ కనకాల, నిఖిల్, కార్తీక్, సామ్రాట్, ఆదర్శ్, ప్రిన్స్, నందకిషోర్, విశ్వ, హర్ష, సన్నీ, తేజ, గిరి, ఆదిత్య. క్రికెట్ కు సంబంధించి ఇప్పటికే రామ్ చరణ్ ప్రాక్టీస్ చాలా శ్రద్ధగా చేస్తున్నాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more