ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఏ చిన్న లబ్ది పొందాలన్న, వంట సిలిండర్ తీసుకోవాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు తప్పని సరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా ఆధార్ కార్డులను జారీ చేశారు. అయితే ఈ ఆధార్ కార్డు గుర్తింపు కార్డు కిందకు వస్తుందా ? రాదా అనే దాని పై కేంద్ర కేబినెట్ మంత్రుల్లో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే దీని పై అనుమానాలను తొలగించేందుకు, గుర్తింపు కార్దు కిందకు వస్తుందా రాదా అన్నదాని పై ప్రభుత్వం ఓ పరిశీలన కమిటీ కూడా వేసింది. ఈ కమిటీకి ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మెన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నేత్రుత్వం వహించాడు. దీనిపై అతను మాట్లాడుతూ.. ఆధార్ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, అది గుర్తింపు కార్డు కాదని స్పష్టం చేశారు. "ఆధార్ అనేది వాస్తవంగా ఒక సంఖ్య. దానికి అనుబంధంగా ఉండే బయోమెట్రిక్ వివరాలు డేటాబేస్‌లో ఉంటాయి. ఆధార్ నెంబరు ఒక కార్డు రూపంలో వస్తుంది. కానీ, అది గుర్తింపు కార్డు కాదు. మీ దగ్గర నంబరు జాగ్రత్తగా ఉంటే, కార్డును నిక్షేపంగా చించి పారేయొచ్చు'' అని ఆయన తెలిపారు. నేను దాన్ని చించిపారేస్తా అని కూడా అన్నారు. మరి ఆయన మాటలు విని మీ కార్డును చించివేస్తే మీకు కష్టాలు తప్పవేమో సుమా... జాగ్రత్త.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more