India celebrates 64th republic day

India celebrates 64th Republic Day, President Pranab Mukherjee

India celebrates 64th Republic Day

64th Republic Day.gif

Posted: 01/26/2013 01:06 PM IST
India celebrates 64th republic day

India celebrates 64th Republic Day

మనము ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవము జరుపు కుంటాము . ఇది దేశవ్యాప్తముగా అందరూ జరుపుకొనే జాతీయ పండగ. 200 సంవత్సరాల పైగా మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిరి. వారు పరిపాలించినంత కాలము మనదేశములోని పరిపాలనా విదానము బ్రిటిష్ రాజ్యాంగము ప్రకారము జరిగేది. వారు వెళ్లిపోయాక మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాల్సి వచ్చింది. రాజ్యాంగమూ తయారైనది , అలా తయారయిన రాజ్యాంగము ఎప్పుదో ఒకప్పుడు మొదలిపెట్టాలి కదా, మనము అలా మొదలు పెట్టిన రోజే .. 1950 జనవరి 26. ఆ రోజు నుంచి మనము ప్రతి సంవత్సరము జనవరి 26 న పండగ జరుపుకుంటున్నాము .

India celebrates 64th Republic Day

మనకు 1947 ఆగస్టు 15 న స్వాతంత్రము వచ్చినది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి , ఎన్నో అంశాలతొ చాలా కాలం పాటు కృషి చేసి రూపొందించారు. ఈ రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అద్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని 2 (రెండు)సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలములో పూర్తిచేశారు. ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు. నాటినుండి భారతదేశము " సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందింది.

India celebrates 64th Republic Day

 'రిపబ్లిక్‌ డే' నాడు భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీలో, రాష్ట్రపతి భవనం సమీపంలోని రైసినా హిల్స్‌ నుంచి, రాజ్‌పధ్‌ ద్వారా, ఇండియా గేట్‌ గుండా, ఎర్రకోట (రెడ్‌ఫోర్ట్‌) దాకా, ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుంది. కాల్బల (ఇన్‌ఫెంటరీ) నౌకాదళ (నేవీ) వాయుసేన (ఎయిర్స్‌ఫోర్స్‌)ల, త్రివిధ సైనిక దళాలు, తమ తమ అధికారిక అలంకారాలతో, ఇందులో పాలుపంచుకుంటారు. దేశం నలుమూలల నుంచీ, పాఠశాలలో సమగ్ర శిక్షణపొందిన వరిష్ట ఎన్‌.సి.సి. కాడెట్స్‌కి చెందిన పటాలం కూడా, ఈ ఊరేగింపులో పాల్గొంటుంది. భారతీయ సైన్యాధిపతి (కమాండర్‌-ఇన్‌-ఛీఫ్‌) గా వ్యవహరించే భారత దేశాధ్యక్షులైన, 'రాష్ట్రపతి' ఈసందర్భంలో, సకల అధికారిక లాంఛనాలతో సైనిక వందనం స్వీకరిస్తారు. 'యూనిటీ ఇన్‌ డైవర్సిటీ' -భిన్నత్వంలో ఏకత్వానికి, బహుముఖ సంకేతంగా, దేశంలోని వివిధ రాష్ట్రాల, విభిన్న ప్రాంతాల, జానపద, నాగరిక కళాకారులతో, విశిష్టమైన సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఈ పెరేడ్‌లో చోటుచేసుకుంటాయి. అత్యంత వైభవోపేతమైన ఈ రిప్లబిక్‌ దినోత్సవ సంబరాలు, చివరికి భారతీయ వైమానిక దళం (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌) జెట్స్‌, వినువీధులలో చేసే 'ఫ్లైపాస్ట్‌' తో ముగిసిపోతుంది. భారతదేశంలో, స్వచ్ఛందంగా యువతీ యువకులూ, బాలబాలికలూ, తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి, ప్రకృతి బీభత్సాల, ప్రమాద భూయిష్టమైన సంఘటనల సందర్భాలలో, పౌరులని పరిరక్షించిన వుదంతాలెన్నెన్నో ఏటేటా జరుగుతూనే వుంటాయి. అలాంటి సాహసోపేతమైన యువతని సత్కరించడానికి, భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'నేషనల్‌ బ్రేవరీ అవార్డ్స్‌' ప్రదానం చేసే సత్సంప్రదాయం, ఏటేటా, రిపబ్లిక్‌ డే నాడు కొనసాగుతూనే వుంటుంది.రిపబ్లిక్‌ డే నాడు న్యూ ఢిల్లీలో, ఎర్రకోట మీద, భారత రాష్ట్రపతి మన మువ్వన్నెల బావుటాని ఎగురవేస్తారని అందరికీ తెలిసిందే. న్యూఢిల్లీలో జరిగే ఈ గణతంత్రదినోత్సవాలని, దేశమంతటా ఆకాశవాణి వివిధ కేంద్రాలూ, దూరదర్శన్‌, తదితర టీ.వీ. ఛానల్స్‌ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుంటే, వీనుల విందుగా వింటూ, కనులపంటగా కంటూ, కుల, మత, వర్ణ, వర్గ వ్యత్యాసాలు లేకుండా, పరస్పరం గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, విందులతో, వినోదాలతో మైమరిచి పోతుంటారు.

India celebrates 64th Republic Day

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 64వ గణతంత్ర దినోత్సం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతర త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,తదితరులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇండియా గేట్ వద్ద అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు.  

India celebrates 64th Republic Day

64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‑లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. పరేడ్ గ్రౌండ్‑లోని గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి కిరణ్‑కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ నాదెండ్ల మనోహర్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డీజీపీ దినేష్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ముఖ్యమంత్రి అమర వీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana leaders fires on vundavalli arun kumar
Madhura sridhar movie backbench student  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more