తెలంగాణ పై నిర్ణయాన్ని వెల్లడించడానికి కేంద్రం పోయిన నెల అఖిలపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం నెల రోజుల గడువు విధించిన హోం మంత్రి తన ప్రకటన వెలువరించడానికి రోజులు దగ్గర పడుతున్న కొద్ది ఇటు సీమాంధ్ర నేతలలో, అటు తెలంగాణ నేతలతో టెన్షన్ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇటు సీమాంధ్ర నేతలు, అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని నాయకులతో పోటా పోటీగా చర్చలు జరుపుతూ ఎవరి ప్రయత్నం వారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకోవడానికి అన్ని అస్త్రాలను సంధించడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు అయిన డా. మోహన్ బాబును కూడా వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. మోహన్ బాబు ఎందుకొచ్చాడని అనుకుంటున్నారా ? కేంద్ర హోం మంత్రికి, డా. మోహన్ బాబుకు మధ్య బంధం గట్టిగా ఉండటంతో ఈయనతో షిండేకు తెలంగాణ ఇవ్వొద్దని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారట. వీరిద్దరికి ఎక్కడిదయ్యా బంధం అంటే...
మోహన్ బాబు, హోంమంత్రి షిండే రాజ్యసభకు ఒకేసారి నామినేట్ అయ్యారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన బంధం పెరిగి పెద్దయ్యిందట. ఆ తరువాత షిండే మన రాష్ట్రాన్నికి గవర్నర్ గా చేసినప్పుడు వీరిద్దరి ఇళ్ళ మధ్య రాకపోకలు బాగా జరిగేవట. ఇప్పుడు అదే బంధాన్ని తెలంగాణ కోసం వాడుకోవాలని సీమాంధ్ర నేతలు వాడుకోవాలని భావిస్తున్నారని అనుకుంటున్నారు. అయితే సీమాంధ్ర నేతల ఆలోచనలు ఎలా ఉన్నా సినీనటుడు మోహన్ బాబు చెబితే హోంమంత్రి షిండే తెలంగాణ ఇవ్వకుండా ఉంటాడా ? అనే వాదన కూడా ఉంది. అయినా తెలంగాణ ఇచ్చేది షిండే కాదు... ఆయన పనిలో భాగంగా ఈ అంశాన్ని చూస్తున్నాడు అంతే కానీ, ఏదో మోహన్ బాబు చెప్పినంత మాత్రాన తెలంగాణ రాకుండా పోతుందా అని కొందరు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి చూద్దాం సీమాంధ్ర నాయకుల ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో....
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more