Asaram bapu controversial statements on delhi gang rape

asaram bapu, spiritual guru asaram bapu, december 16 delhi gang-rape victim, delhi police, gang rape victim, ram singh, mukesh, pawan gupta, vinay sharma, akshay thakur, delhi gang rape victim,delhi gang rape incident, jyothy singh, friend,

asaram bapu controversial statements on delhi gang rape

asaram bapu.gif

Posted: 01/08/2013 10:10 AM IST
Asaram bapu controversial statements on delhi gang rape

asaram bapu controversial statements on delhi gang rape

ఢిల్లీలో  యువతి  గ్యాంగ్ రేప్  ఘటనపై  దేశమంత నిందితులకు  శిక్షపడాలని  నిరసనలు, ఆందోళనలను  చేస్తున్న సమయంలో   ఆధ్యాత్మిక గురువు  ఆశారామ్ బాపూ  మాత్రం నిందితులకు కఠినమైన శిక్ష వేయటాన్ని  ఆయన తీవ్రంగా ఖండించారు.  అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి గ్యాంగ్ రేప్  జరిగిన సమయంలో   జ్యోతి సింగ్ దే పెద్ద తప్పు అని  ఆయన ప్రకటన చేశారు.  ఆరుగురు తాగుబోతులు  ఎదురైనప్పుడు  ఆమె దైవనామ స్మరణ చేయాల్సింది.  వారిలో  ఒకరి చేయి పట్టుకొని  నిన్ను నా సోదరుడిలా  భావిస్తున్నా . సోదరులారా ..నేను నిస్సహాయరాలిని.  మీరంతా  నా సోదరులు.. నా మత సోదరులు  అని  ఉండాల్సింది.  దేవుణ్ణి స్మరిస్తూ  వారి కాళ్లు, చేతులు పట్టుకొని  బతిమాలితే  ఈ ఘోరం జరిగి ఉండేది కాడేది  కాదని  ఆయన అన్నారు. తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపు ఢిల్లీ రేప్ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలంటూ యావద్దేశం నినదిస్తున్న సమయంలో.. ఈయన భిన్నంగా స్పందించారు. అత్యాచారానికి గురైన జ్యోతికి కూడా ఈఘటనలో సమాన పాత్ర ఉందని, ఈ దురాగతానికి ఆమె కూడా బాధ్యురాలేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని సెలవిచ్చారు. నిందితులను ఎదిరించకుండా అన్నా.. అన్నా అని బతిమాలుకున్నట్లయితే ఈ ఘోరం జరిగేది కాదని, ఆమె బతికి ఉండేదని వ్యాఖ్యానించారు.

asaram bapu controversial statements on delhi gang rape

ఆమె భగవంతుడిని స్మరించుకుంటూ వారిని అర్ధించాల్సి ఉండాలన్నారు. అసలు ఆమె అర్ధరాత్రి స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కకుండా ఉండాల్సిందన్నారు. అత్యాచారాలను నిరోధించడానికి తీసుకురావాలనుకుంటున్న కొత్త చట్టం దుర్వినియోగమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఆశారామ్ బాపు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మత గురువులు, రాజకీయ నాయకులు ఇటువంటి ప్రకటనలు చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ అన్నారు. ఆశారాం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో హితవు, బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతాయని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మమతా శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా తన తన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తడంతో ఆశారామ్ మాటమార్చారు.జ్యోతినుద్దేశించి తాను అవమానకర వ్యాఖ్యలు చేయలేదని.. నిందితుల ఆరుగురిలో ఏ ఒక్కరైనా నా దగ్గర దీక్ష తీసుకున్న వారైతే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని మాత్రమే అన్నానని చెప్పారు. ఈ విషయంలో మీడియా అతిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిపై  జ్యోతి సింగ్  స్నేహితుడు మండిపడ్డారు.  ఆశారం ఉద్దేశం ఏమిటి?  ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసినందుకు  ఆయనను  కూడా శిక్షించాలి  అని జ్యోతి స్నేహితుడు డిమాండ్ చేశారు.   ఆశారామ్ చేసిన వ్యాఖ్యలపై  ఇంకెంత దుమారం రేగుతుందో  చూడాలి? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Self protection kill the rapists dgp dinesh reddy
Swami vivekananda suffered from 31 ailments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more