తెలంగాణకు అనుకూలమని అఖిలపక్ష సమావేశంలో టిడిపి చెప్పడంతోనే తన రాజకీయ భవిష్యత్తుకు గండి పడుతుందనే భయంతో టిఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు కల్లుతాగిన కోతిలా లతుకోరు భాష ఉపయోగించి టిడిపిపై, పార్టీ అధినేత చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం టిఆర్ఎస్కు తొత్తుగా వ్యవహరించకూడదని హితవు పలికారు. జెఎసి విషయంలో కోదండరాం స్వతంత్రంగా వ్యవహరిస్తే తెలంగాణ విషయంలో తాము కలసి పనిచేయడానికి సిద్ధమని అన్నారు. నగరంలోని టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిడిపి నేతలు మాట్లాడుతూ కేంద్రహోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలమని టిడిపి చెప్పడంతో జీర్ణించుకోలేక కెసిఆర్ తమ పార్టీపై చేస్తున్న విమర్శలు మానుకోకపోతే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. టిడిపి వైఖరిని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇప్పటికైనా ఆపకుంటే తమ తడాఖా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పదవులు, డబ్బులు కూడబెట్టుకుంటున్న కెసిఆర్ కుటుంబం త్వరలో రాజకీయ సమాధి కావడం ఖాయమని తెలిపారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, పార్టీ మనుగడకోసం విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అన్ని పార్టీల నాయకులు టిడిపి వైఖరిని స్వాగతిస్తుండగా కేవలం టిఆర్ఎస్, జెఎసి నాయకులు మాత్రమే భయపడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా టిడిపి వైఖరిని అర్ధం చేసుకోవాలని, కెసిఆర్ నిజస్వరూపాన్ని గమనించాలని కోరారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికే సోనియాగాంధీని మాట్లాడనివ్వడం లేదని, ఆమె మాట్లాడితే కెసిఆర్ ఆవినీతి బట్టబయలు అవుతుందని విమర్శించారు. పొలిటికల్ జాక్ ఛైర్మన్ కోదండరాం కెసిఆర్ తొత్తుగా వ్యవహరించకుండా స్వతంత్రంగా ఉద్యమించాలని హెచ్చరించారు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా రంగులు మారుస్తున్న కెసిఆర్ తన భాష మార్చుకోకపోతే భంగపాటు తప్పదని అన్నారు. టిడిపి ఫ్లెక్సీలను తగులబెట్టినా, నాయకులను అడ్డుకున్నా సహించబోమని, కార్యకర్తలు తరిమితరిమి కొడతారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more