మహిళలపై జరుగుతున్న అత్యాచారల పై మాట్లాడుతున్న మహిళ ముఖ్యమంత్రి అనుకోని షాక్ తగిలింది. మహిళలపై అత్యాచారం చేసి వారికి రేటు కడుతున్నారని ముఖ్యమంత్రి అన్న మాటలకు మాజీ మంత్రి .. మహిళ ముఖ్యమంత్రిగారు, మీమ్మల్ని రేప్ చేస్తే రేటు ఎంత కడతారు అని నిండు సభలో అడగటంతో సభ మొత్తం ఒక్కసారిగా నిశబ్ధం తో నిండిపోయింది. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా అడగడతో సభలోని అందరు ఆశ్చర్యపోయి ఆ ఇద్దరి వైపు చూశారు. పబ్లిక్ లో ఒక అమ్మాయి చేయి పట్టుకుంటేనే .. లాగి లెంపకాయలు కొట్టే కాలంలో.. మహిళ ముఖ్యమంత్రి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో ఎంత దారుణమైన విషయం అని రాజకీయ నాయకులు అంటున్నారు. ఆ ముఖ్యమంత్రి ఎవరు కాదు పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ . మాజీ మంత్రి ఎవరో కాదు సిపియం నాయకుడు అనిసూర్ రెహమాన్. ఇప్పుడు రెహమాన్ చేసిన వ్యాఖ్యలు కేంద్రంలో వివాదంగా మారాయి. ‘‘ మమతా బెనర్జీ మీ పై మానభంగం జరిగితే.. ఎంత రేటు ఇవ్వాలి ’’ అని పబ్లిక్ ర్యాలీలో ఒక సీనియర్ నాయకుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాంలో రేప్ బాధితులకు ప్రభుత్వం డబ్బు చెల్లించిస్తామని మమతా చెప్పినప్పుడు అనిసుర్ రెహమాన్ .. మీ ఫీజు ఎంత? మీ పై రేప్ జరిగి ఉంటే , మీ రేటు ఎంతలో ఉంటుందని ఆయన ప్రశ్నించారు. దీని పై పెద్ద వివాదం రేగింది. దీని పై కాంగ్రెస్ పార్టీ, బీజేపి పార్టీలు తీవ్రంగా ఖండించారు. త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెహమాన్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
ఒక సీనియర్ నాయకుడు ఇలా మాట్లాడటం మహిళలోకాన్ని కించపరిచినట్లుగా ఉందని మహిళ సంఘాలు అంటున్నాయి. వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాజీ మంత్రి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రెహమాన్, కమ్యూనిష్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ నాయకుడు. 21 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడు గా ఉంటున్నాను. నేను మమతా బెనార్జీ ని ఉద్దేశించి అనలేదని ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు క్షమాణలు చెప్పినట్లు తెలుస్తోంది. మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి తప్పు నేను చేయనని రెహమన్ చెప్పటం జరిగింది. రెహమాన్ ఉపయోగించిన పదాలు బెంగాల్ సంస్కృతి ని దెబ్బ తీసే విధంగా న్నాయి టీఎంసి నాయకుడు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పార్థ చటర్జీ అన్నారు. రెహమన్ తగిన శిక్ష వేయాలని ఆయన కోరారు. మాజీ మంత్రి అనిసుర్ రెహమాన్ చేసిన వ్యాక్యలపై సీపిఎం పార్టీ నాయకుడు శ్యామల్ చక్రవర్తి ఖండించారు. రెహమాన్ మంచి స్నేహితుడు గా ఉంటాడు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధకరమని ఆయన అన్నారు. నిన్న రాష్ట్రపతి కొడుకు అభిజిత్ అమ్మాయిలపై నోరు జారిన విషయం తెలిసిందే. అది మరిచపోకుండే ఒక సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి ఒక రాష్ట్ర మహిళ ముఖ్య మంత్రి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా దారుణమని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more