ఆల్ పార్టీ మీటింగ్ లో ఏలాంటి ఫలితాల వస్తాయని ఆంద్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్రం నుండి తీపి కబురు రాలేదు. కానీ కేంద్రానికి కొంచెం సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఆల్ పార్టీ మీటింగ్ లో ఎనిమిది రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వీలైనంత త్వరగా సమస్యను షరిష్కరించాలని అన్నీ రాజకీయ పార్టీలు కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎనిమిది రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. కేంద్ర హోంమంత్రి షిండే మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. కాగా అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో ఢిల్లీ నార్త్‌బ్లాక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తెలంగాణవాదులను ఖాళీ చేయించారు. తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు, పలు ప్రజా సంఘాల నేతలు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శించారు. తెలంగాణ అంశంపై నెలరోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భేటీలో ఎనిమిది పార్టీలు పాల్గొన్నాయని, అన్ని పార్టీలు సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరాయన్నారు.
అందరి అభిప్రాయాలు, వాదనలు విన్నామని, కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని.... ఈ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాల మేరకే నిర్ణయం ఉంటుందని షిండే తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. తెలంగాణపై ఇదే చివరి అఖిలపక్షమని షిండే తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తెలంగాణ ప్రజులు, తెలంగాణ నాయకులు మండిపడుతున్నారు. ఇది కేవలం షిండే కొరకు పెట్టిన సమావేశం మాదిరిగా ఉందని తెలంగాణ నాయకులు అంటున్నారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేసీఆర్ శనివారం తెలంగాణ బంద్‑కు పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అఖిలపక్ష భేటీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. అన్ని పార్టీలు పాతపాటే పాడాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ బంద్‑ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెలరోజుల్లో తెలంగాణపై నిర్ణయం అన్న షిండే మాటలు కంటితుడుపు చర్యలేనని కేసీఆర్ మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more