ఆల్ పార్టీ మీటింగ్ సమావేశం జరుగుతుంది. అయితే ఈ మీటింగ్ లో తెలంగాణ పై ఎలాంటి ఫలితం రాబోతుందని ఆంద్రప్రదేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొన్ని పార్టీలు ఆల్ పార్టీ మీటింగ్ ముందే తెలంగాణ పై నిర్ణయం చెప్పాయి. కానీ కొన్ని పార్టీలు మాత్రం తమ అభిప్రాయం చెప్పకుండా సిక్రెట్ గా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వివాదంపై హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం తూతూ మంత్రంగానే ముగుస్తుందా? లేక ప్రయోజనకరమైన చర్చ జరిగి ఫలితం వైపు అడుగులు వేస్తుందా? అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై ఎలాంటి వైఖరిని ప్రకటించాలనే విషయంపై కాంగ్రెస్ అధినాయకత్వం మల్లాగుల్లాలు పడుతోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌తో సమావేశమై అఖిలపక్ష సమావేశంలో అనుసరించవలసిన విధానం గురించి చర్చించారు. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిసింది. ఈ సమావేశం తర్వాత సోనియా గాంధీ సీనియర్ మంత్రులు చిదంబరం, ఏ.కె.ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్‌తో కూడా తెలంగాణ అంశంపై చర్చ జరిపినట్లు సమాచారం. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిసింది. అఖిలపక్ష సమావేశానికి ఎవరిని పంపాలనే దానిపై కూడా వారు సమాలోచనలు జరిపారు.
అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, రాష్ట్రం నుండి వచ్చిన ఆరుగురు కాంగ్రెస్ నాయకులతో తెలంగాణ, సమైక్యాంధ్రపై జరిపిన చర్చల వివరాలను ఆజాద్ పార్టీ అధ్యక్షురాలికి వివరించారు. అఖిల పక్ష సమావేశానికి తెలంగాణ, సీమాంధ్ర నుండి ఎవరిని పంపిస్తే ప్రజలకు ఎలాంటి సందేశం వెళుతుందో, దీని వలన కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా వారు సమీక్షించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరగటం వలన రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్‌కు చెడ్డపేరు వచ్చిందని పార్టీ అధినాయకత్వం ఇప్పుడు బాధపడుతున్నట్లు ఏఐసిసి వర్గాలు తెలిపాయి. ఈ వివాదంపై కనీసం ఇప్పుడైనా ఒక స్పష్టమైన వైఖరిని అవలంభించటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బతికించుకోవాలని అధినాయకత్వం ఆలోచిస్తోంది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగవుతుందో అర్థంగాక కాంగ్రెస్ అధినాయకత్వం సతమతమవుతున్నట్టు సమాచారం. కొత్త హోం మంత్రి సుశీర్ కుమార్ షిండే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వివాదం గురించి అవగాహన చేసుకునేందుకే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని గులాం నబీ ఆజాద్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ ప్రకటించడాన్ని పరిశీలిస్తే నార్త్ బ్లాక్‌లో జరిగే అఖిలపక్ష సమావేశం తూతూ మంత్రంగానే ముగుస్తుంది తప్ప ఫలితం దిక్కుగా సాగదనే భావన వ్యక్తమవుతోంది. అయితే ఈ సమావేవంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వివాదంపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించే పక్షంలో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more