గత కొన్ని రోజులుగా తెలంగాణ అంశాన్ని నాన్చుతూ వస్తున్న యూపీఏ ప్రభుత్వం ఎట్టకేలకు ఓ అడుగు ముందుకు వేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను మరోసారి తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ అఖిలపక్ష సమావేశం టైం రానే వచ్చింది. మరి కొద్ది గంటల్లో అన్ని పార్టీల నాయకులతో భేటి ప్రారంభం అవుతుంది. ఢిల్లీలో మైనస్ డిగ్రీల చలి ఉన్నా, ఢిల్లీలో రాజకీయాలు మాత్రం వేడి వేడిగా మారాయి. ఇక అఖిల పక్ష సమావేశంలో ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇక వైయస్సార్ సీపీ అఖిల పక్షంలోనే తన నిర్ణయాన్ని చెబుతామని ప్రకటించారు. మజ్లీస్ పార్టీ, సీపీఎం పార్టీలు సమైక్యాంద్రకే మద్దతు తెలుపుతున్నాయి. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ ఏం చెబుతుందన్నదే ఇక్కడ ఆసక్తి రేపే విషయం. మరికొద్దిగంటల్లో ప్రారంభం కానున్న అఖిలపక్షంపై ఎవరు ఏమి మాట్లాడతారు ? కాంగ్రెస్ ప్రతిపక్షాలను ఇరికిస్తుందా? ప్రతిపక్షాలే కాంగ్రెస్‌ను ఇరుకున పెడతాయా? తెలంగాణపై అఖిలపక్షంలో ఏదో ఒక నిర్ణయం తేలుతుందా ? మళ్లీ కాలక్షేపం కబుర్లేనా ? అని తేలనుంది.
మన రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, టీడీపీ వైయస్సార్ సీపీలు మాత్రం తన వైఖరి చెప్పకుండా ఇలా నాన్చే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వైఖరి బట్టే తన వైఖరి చెప్పనుంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అఖిలపక్షంలో ఎలాంటి అభిప్రాయం చెప్పే అవకాశం ఏ మాత్రం లేదు. రెండు ప్రాంతాల నుంచి హాజరుకానున్న నాయకులు వారి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వాదించనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం శషభిషలు విడిచిపెట్టి తెలంగాణ అనుకూలవాదమే వినిపించనుంది. 2008లో తెలంగాణకు అనుకూలంగా చేసిన తీర్మానాన్ని ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి ఇచ్చామని గుర్తు చేయనుంది. మా అభిప్రాయాన్ని సీల్డు కవర్ లో పెట్టి పంపిస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళుతూ మాట్లాడుతూ... ఇది కాల క్షేపం కోసం వేసిన అఖిలం, గత మూడేళ్లుగా ఇదే చెబుతుంది అని మరి కొన్ని సాగదీయటానికి మరో నాటకం ఆడుతుందని అన్నారు. ఇక మొత్తానికి ఎవరి వ్యూహంలో వారు ఉన్నారు. ఎవరు ఏం చెబుతారు ? అఖిలపక్ష భేటి తరువాత రాష్ట్ర రాజకీయాలు ఏవిధంగా మార బోతున్నాయో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more