కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నవ్వుతూ కనిపిస్తే ఎలా ఉంటారో అందరికి తెలుసు? కానీ ఆమె నిండు సభలో విశ్వరూపం చూపించారు. సోనియా గాంధీ లోక్‌సభలో ఉగ్రరూపాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సభలో ఎప్పుడూ వౌనంగా కూర్చునే సోనియా అకస్మాత్తుగా ఆగ్రహోదగ్రురాలు కావటంతో ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం కూడా అవాక్కయింది. కేంద్ర మంత్రి వి.నారాయణ స్వామి ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్ధేశించిన బిల్లును లోక్‌సభలో ప్రతిపాదిస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు యశ్‌బీర్ సింగ్ ఆయన చేతిలో నుండి బిల్లు ప్రతిని లాగేసుకుని వెళ్లిపోవటం ప్రారంభించారు. దీంతో నారాయణ స్వామి ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. అయితే ముందు వరుసలో కూర్చున్న సోనియా ఈ పరిణామానికి ఆగ్రహంతో ఊగిపోతూ ముందుకు దూకి 'మీరు ఏం చేస్తున్నారు' అంటూ యశ్‌బీర్ సింగ్‌ను నిలదీశారు. ఆమె మెరుపు వేగంతో పోడియంలోకి దూసుకొచ్చి యశ్‌బీర్‌సింగ్‌ను చేయిపట్టుకుని ఆపివేయటంతో పాటు ఆయన రెండో చేతిలో ఉన్న బిల్లు ప్రతిని తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రక్రియలో ఇరువురు కొన్ని సెకండ్ల పాటు పరస్పరం తోసుకుంటూ కొట్లాడుతున్నట్లు కనిపించింది. అయితే యశ్‌బీర్ సింగ్ ఒక వైపుకు ఒరిగిపోతూ కుడిచేతిలో ఉన్న బిల్లు ప్రతిని మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారుడు ప్రణీత్ శేఖర్‌కు అందజేసేందుకు ప్రయత్నించడంతో ఇరుపక్షాల మధ్య ముష్టియుద్ధం జరిగే ప్రమాదం ఏర్పడింది. ఈ తోపులాటలో బాపిరాజు, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్‌తోపాటు పలువురు ఇతర సభ్యులు సోనియాకు అండగా నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పలువురు సభ్యులు కూడా ముందుకు దూసుకు వచ్చి యశ్‌బీర్‌సింగ్‌కు మద్దతు ఇవ్వటంతో పాటు కాంగ్రెస్ సభ్యులతో తోపులాటకు దిగారు.
ఈదశలో సోనియా ఎస్‌పి సభ్యులతో వాదిస్తూనే మరోవైపు సభను కొనసాగించాలని స్పీకర్ మీరా కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో లోక్‌సభలో మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరుపక్షాలు కొట్టుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్పీకర్ సభను గురువారానికి వాయిదావేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా సభలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగటంతో కాంగ్రెస్‌కు చెందిన కొందరు సీనియర్ సభ్యులు సోనియాను సభ వెలుపలికి తీసుకెళ్లారు. సభ నుంచి సోనియా బయటికి వెళ్తున్నప్పుడు పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఆమె చుట్టు రక్షణ వలయంగా ముందుకు సాగారు. ఇదిలావుంటే, సోనియా గాంధీ తమ పార్టీ సభ్యుడి గొంతు పట్టుకోవటంతో పాటు చేయి చేసుకున్నారని, ఆమె ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్, ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కొందరు బిజెపి సభ్యులు కూడా ఎస్‌పి సభ్యుడికి మద్దతు పలికారు. సభ గురువారానికి వాయిదా పడిన తర్వాత కూడా ఇరుపక్షాల సభ్యులు సభలోనే నిలబడి పరస్పరం విమర్శించుకోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more