Narendra modi set to win gujarat elections

narendra modi, gujarat assembly elections, sonia gandhi, gujarat polls,chief minister narendra modi, bharatiya janata party, bjp, win for narendra modi, gujarat womens

narendra modi set to win gujarat elections

narendra modi.gif

Posted: 12/19/2012 11:31 AM IST
Narendra modi set to win gujarat elections

narendra modi set to win gujarat elections

నరేంద్ర మోడీ ఈ పేరు ఇప్పుడు ప్రపంచదేశాలలో  ప్రజల్లో నానుతున్న పేరు.  మోడీ మూడోసారి కూడా విజయం సాధిస్తారని  కొంతమంది  జ్యోతిష్యులు చెబుతున్నారు. గుజరాత్  ముఖ్యమంత్రికి హ్యాట్రిక్ విజయం చేకూర్చుటానికి అధిక సంఖ్యలో  మహిళలే ముందున్నారని   సర్వేలు చెబుతున్నాయి. అయితే ఆయన విజయం కొన్ని రహస్యలు ఉన్నాయాని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. మోడీ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు చాలా వరకు ఎవరికీ తెలియవు. మాటల్లో గాంభీర్యం, చేతల్లో విలక్షణత, ఆహార్యంలో వైవిధ్యం, తిరుగులేని ఛరిష్మాతో సాగుతున్న మోడీ మేనియా వెనక చాలా కథే ఉంది.సాధారణంగా నాయకులు జనంలోకి వచ్చే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందులోనూ మోడీ శైలే వేరు. క్రాప్ లుక్ ఒకేలా ఉండేట్లు చూసుకుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించినా.. ప్రత్యేకమైన వర్క్‌తో ఢిఫరెంట్‌ లుక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.  మోడీలో ఎవరికీ తెలియని మరో కోణం దాగుంది. ఆయన అటల్‌ బిహారీ వాజ్‌పేయిలాగే... స్వతహాగా కవి, రచయిత. భావుకతతో ఆయన రాసే కవిత్వాలు... ప్రతి ఒక్కరి మదిని దోచేస్తాయట. ఈ విషయం మీడియా దృష్టిని ఆకర్షించకపోవడానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే మోడీ గుజరాతీ భాషలోనే కవితలు రాస్తారు.మోడీ ఆజన్మ బ్రహ్మచారి అని కొందరు.... ఆరెస్సెస్‌లో క్రియాశీల పాత్ర పోషించడం కారణంగా... పెళ్లే చేసుకోలేదని మరికొందరు భావిస్తుంటారు. ఇవేవీ నిజం కాదంటున్నాయి కొన్ని కథనాలు. మోడీకి ఎప్పడో పెళ్లైందని... అయితే కొన్ని కారణాలతో... ఆ బంధానికి స్వస్తి పలకాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. మోడీకి అత్యంత దగ్గరి వ్యక్తి ఆయన మాతృమూర్తే.  అమ్మ ఆశీర్వాదం తీసుకోనిదే ఏ పనీ మొదలు పెట్టరు. రాత్రి త్వరగా పనులు ముగించుకుని అమ్మతో కలిసే భోజనం చేస్తారు. వృద్ధురాలు అవడంతో... కంటికి రెప్పలా చూసుకుంటారు.

narendra modi set to win gujarat elections

మోడీకి డబ్బుపై అసలు ఆసక్తే లేదని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. డబ్బు యావ అసలే లేకపోవడం... రాజకీయాల్లో మోడీకి ప్లస్ పాయింట్‌గా అభివర్ణిస్తుంటారు. తనకంటూ ప్రత్యేకంగా ఎవరూ లేకపోవడంతో... డబ్బుల వెనక పరుగెత్తాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే మోడీకి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువేనట. పైకి కనిపించినంత.. అంతర్గతంగా ఉండరనేది సన్నిహితులు చెప్పే మాట. నరేంద్రమోడీ పూర్తి శాఖాహారి. స్మోకింగ్, డ్రింకింగ్ తో సహా ఏ ఇతర అలవాట్లూ లేవు. పని ఒత్తిడి పెరిగితే.. మొహంపై చిరునవ్వు... పూర్తి స్వీయ నిగ్రహం.. ఇదీ మోడీ పాజిటివ్ థింకింగ్. మోడీ ఏ బహిరంగ సభల్లో పాల్గొన్నా... ముందు భాగంలో వల లాంటి నిర్మాణం ఉండి తీరాల్సిందేనట.అప్పట్లో నాయకులపై బూట్లు విసిరిన ఉదంతాల నేపథ్యంలో మోడీ ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక గుజరాత్‌లో మహిళలు మోడీపై అధిక ఆరాధ్య భావంతో ఉంటారట. ఏ ఇతర రాజకీయనాయకుడి బహిరంగ సభలకు రానంతగా మోడీ సభల్లోనే మహిళలు అధిక సంఖ్యలో కనిపించడం అందుకు నిదర్శనమని చెప్తుంటారు. ఇవీ మోడీ గురించి జనానికి తెలియని విషయాలు. దేశమంతా... ఇప్పుడు ఎక్కడ చూసినా మోడీ మంత్రమే. గుజరాత్‌ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారంటూ... దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ప్రధానమంత్రి అభ్యర్థిగా నూటికి నూరుపాళ్లూ సరిపోతారన్న వ్యాఖ్యానాలు పెరిగిపోతున్నాయి. అయితే మోడీ జాతకం మరో సారి తెలుస్తోంది. రేపు గుజరాత్ ఎన్నికల కౌంటింగ్  జరుగుతుంది.  ఈ కౌంటింగ్ లో  గుజరాత్ మహిళలు  మళ్లీ ఎవరికి పట్టం కట్టారో తెలిపోతుంది. అయితే ఈ సారి కూడా  మోడీ విజయం సాధిస్తే..మాత్రం రాబోయే రోజుల్లో  నరేంద్రమోడీ దేశాన్ని పరిపాలిస్తారని  గుజరాత్  జ్యోతిష్యులు అంటున్నారు.  మరో కొన్ని గంటల్లో  గుజరాత్  జాతకం బయటపడుతుంది. అప్పటి వరకు వేచి చూద్దాం.. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress shruti hassan latest news
Chandrababu naidu ready for all party meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more