ఈనెల 28న తెలంగాణ పై కేంద్రం అఖిల పక్ష సమావేశానికి తొమ్మిది రాజకీయ పార్టీలను ఆహ్వనించాయి. రాష్ట్రంలో ఉన్న తొమ్మిది రాజకీయ పార్టీలు అఖిల పక్ష సమావేశానికి సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు అందరు కన్ను టీడీపీ పై పడింది. తెలంగాణకు అనుకులంగా చెబితేనే తెలంగాణలో టీడీపి పార్టీ బతికి బట్టకడుతుందని ఆ పార్టీ తెలంగాణ నాయకులు అంటూన్నారు. ఒక వేళ తెలంగాణకు అనుకూలంగా చెబితే .. సమైక్యాంద్రలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని సీమాంద్ర నాయకులు అంటున్నారు. ఈ సమస్య పై చంద్రబాబు నాయుడు అన్నిప్రాంతాల నాయకులతో భేటి అయినట్లు తెలుస్తోంది. అన్ని ప్రాంతాల నాయకులతో మట్లాడిన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశంలో టీడీపీ తెలంగాణాకు మద్ధతుగానే తమ వైఖరి వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖలో స్పష్టం చేసిన అంశాలనే పునురుద్ఘాటించాలి ఆ పార్టీ భావిస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణా ప్రాంతానికే చెందిన ఇద్దరు ప్రతినిధులను పంపాలని యోచిస్తోంది. తెలంగాణాపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. 2008 ఎన్నికలకు ముందు తెలంగాణాపై ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలుగుదేశం పార్టీ లేఖ రాసింది. తెలంగాణాకు తాము అనుకూలమని టిడిపి ఆ లేఖలో ప్రస్తావించింది. ఈ నిర్ణయం ఆధారంగానే 2009 ఎన్నికల్లో ఆ పార్టీ టిఆర్ఎస్ తో పొత్తుపెట్టుకొంది. ఈ సారి అఖిలపక్షంలో కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేయాలని భావిస్తోంది. పాదయాత్రలో ఉన్న పార్టీ అధినేత తెలంగాణాకు తాము వ్యతిరేకం కాదని ఇప్పటికే ప్రకటించారు.
అధినేత ప్రకటనతో పార్టీలో కదలిక మొదలైంది. అఖిలపక్షసమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ ముఖ్యనాయకులంతా ఈ నెల 22.23 తేదిల్లో కరీంనగర్ జిల్లాలో పార్టీ అధినేత చంద్ర బాబుతో సమావేశం కానున్నారు. అఖిలపక్షసమావేశానికి ఎవరెవరిని ప్రతినిధులుగా పంపించాలి? ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలని అనే అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణకు అనుకూల వైఖరి ప్రకటిస్తే సీమాంధ్ర ప్రాంతంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆ ప్రాంత నేతలు ఆందోళన చెందుతున్నారు. అఖిల పక్షానికి అధినేత చంద్రబాబు హాజరైతే తెలంగాణాలో కలిగే ప్రయోజనం కంటే సీమాంధ్రలో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు స్వయంగా హాజరయ్యే కంటే పార్టీ తరపున ప్రతినిధులను పంపడమే ఉత్తమమని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రాంత నాయకుల అభిప్రాయం వేరుగా ఉంది. అఖిలపక్షానికి చంద్రబాబు స్వయంగా హాజరైతే తెలంగాణాలో పార్టీకి మరింత మైలేజీ పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు. పార్టీ తరపున ఇద్దరు వెళ్ళినా ఒక్కటే అభిప్రాయాన్ని చెప్పాలని పార్టీ భావిస్తోంది. వేర్వేరు ప్రాంతాల కంటే తెలంగాణ ప్రాంతానికి చెందినవారే సమావేశానికి వెళ్తే ప్రయోజనమని సీమాంద్రప్రాంత నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ అంశాలన్నింటిపై సమగ్రంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణా అంశంలో పార్టీ తీసుకొనే నిర్ణయం ఏ మేరకు కలిసివస్తోందో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more