ఇద్దరు ఒకే పార్టీ చెందిన నాయకులు అయిన వారి మద్య విభేదాలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, మరొకరు పార్టీ అధ్యక్షుడు. వీరి విభేదాలతో నాయకులు ఆందోలన పడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ పీసీసీ అధ్యక్షుడు బొత్సల మధ్య విభేదాలు మేథోమధనం సాక్షిగా బయటపడ్డాయి. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న పార్టీ సదస్సు ఏర్పాట్లను అగ్రనేతలిద్దరూ పర్యవేక్షించాల్సి ఉండగా సీఎం మాత్రం అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని బొత్సవర్గీయులంటున్నారు. విశాఖ జిల్లాలో ఇందిరమ్మ బాటను వాయిదా వేయాలని బొత్స కోరినా సీఎం ససేమిరా అన్నట్టు సమాచారం. మొత్తానికి ఇద్దరు అగ్ర నేతల మధ్య నెలకొన్న సంబంధాలు పార్టీ సమావేశంపై ఏమేరకు ప్రభావం చూపుతాయనే ఉత్కంఠలో పార్టీశ్రేణులున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స మధ్య ఉన్న విభేదాలు ఈసారి మేథోమధనం సాక్షిగా బయటపడ్డాయి. సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్ ఏమాత్రం సహకరించడం లేదని. ఆయన వర్గీయులుగా ముద్రపడ్డ నేతలు కూడా ఎల్బీ స్టేడియం వైపు చూడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయినా బొత్స మాత్రం తనపని తాను చేసుకుపోతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవే తప్పా సీఎం కిరణ్ కుమార్ రెడ్డివి కావనే భావన ప్రజల్లో కలిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. అటు ముఖ్యమంత్రి విశాఖ జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని ఒక రోజు వాయిదా వేసుకోవాలని బొత్స సీఎంను కోరారు జిల్లా నేతలు సదస్సుకు హాజరవుతుండటంతో వారు ఇందిరమ్మబాటలో పాల్గొనే అవకాశం ఉండదని కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వాయిదాకు ససేమిరా అన్నట్టు సమాచారం. దీంతో ఇరువురి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం వర్గీయులు ఎల్బీ స్టేడియం వైపు చూడకపోయినా కాంగ్రెస్ పార్టీ సారథిగా బొత్స అన్ని తానై కార్యక్రమాల్ని చూసుకుంటున్నారు.. ముఖ్యంగా ప్రతి అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బొత్స పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర పూర్తైంది. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయ్యింది. ఇప్పటివరకూ అన్ని ప్రాంతాల నాయకులతో కలిసి ఒకే వేదికపై సదస్సు నిర్వహించిన సందర్భాలు లేవు. ఇంత వరకు తెలంగాణ అంశం ఓవైపు జగన్ పార్టీ మరోవైపు అధికారపార్టీని భయపెట్టాయి. ఇప్పటికీ అలాంటి ప్రతికూలతలున్నా పార్టీ పటిష్టత కోసం మేథోమధనం పేరుతో ముందడుగువేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని ప్రాంతాల నేతలు ఒకే వేదికపైకి తీసుకురావడం ఇదే తొలిసారి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more