కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అయితే దేశంలో ఉన్న సమస్యలను ఆయన ముకుతాడు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ముందుగా కేంద్రం అమలు చేస్తున్న నగదు బదిలీ వలన లోపాలు జరిగితే వాటికి ఎలా ముకుతాడు వేయాలో ఆలోచించే పనిలో ఉన్నారు. చిదంబరం మనస్సులో ప్రధాన మంత్రి కావాలని చిన్న కోరిక ఉన్న విషయం ఇటీవల బయట పడింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా చిదంబరం కోరిక గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు జరిగే నగదు బదీలి మీటింగ్ చిదంబరం కొన్ని రహస్యలను చెబుతాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నగదు బదీలి పథకం పై ఆయన చాలా క్రుషి చేసినట్లు తెలుస్తోంది. ఆధార్ ఆధారిత నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం హడావుడిగా అమలు చేస్తోందన్న ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం తోసిపుచ్చుతూ, దశలవారీగా అమలు చేసే ఈ పథకం నిధులు పక్కదారి పట్టడం, ఆలస్యాలు, ఒకరికి బదులుగా మరొకరు లబ్ధి పొందడం లాంటి లోపాలను పూర్తిగా తొలగిస్తుందని చెప్పారు. ‘ఇది లోపరహిత మార్పిడికి తోడ్పడుతుంది. మేము ప్రవేశపెట్టే ఈ పథకం మరింత పారదర్శకమైందని మేము నమ్ముతున్నాం. ఇది లీకేజిలను, ఆలస్యాలను, ఒకరికి బదులుగా మరొకరు లబ్ధి పొందడం లాంటి లోపాలను పూర్తిగా తొలగిస్తుంది. ఈ పథకం అత్యున్నత స్థాయి సామర్థ్యం, పారదర్శకతను తీసుకు వస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం’ అని చిదంబరం రాజ్యసభలో చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారుల అకౌంట్లలోకి నేరుగా నగదును బదిలీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అని అంటూ బిజెపికి చెందిన ప్రకాశ్ జావ్డేకర్ అడిగిన స్వల్పకాలిక ప్రశ్నకు సమాధానంగా చిదంబరం ఈ విషయం చెప్పారు. 34 గుర్తించిన కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న లేదా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాల కింద లబ్ధిదారులకు నేరుగా ఆధార్ ఆధారిత నగదు బదిలీ పథకానికి నిధులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని, మొదటి విడతగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 43 జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ‘ఈ పథకాన్ని హడావుడిగా రూపొందించలేదు. అలాగే హడావుడిగా కూడా దీన్ని అమలు చేయడం లేదు. ఈ పథకం విషయంలో మా నినాదం ఏమిటంటే మనం తొందరపడరాదని, నిదానంగా దశలవారీగా దీన్ని అమలు చేద్దామనేదే’నని చిదంబరం చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన వౌలిక సదుపాయాలు, సిబ్బందికి తగిన శిక్షణ లేవన్న సభ్యుల భయాలను ఆయన తోసిపుచ్చుతూ, ఈ పథకాన్ని అమలు చేయడానికి టెక్నాలజీ తోడ్పడుతుంది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. అయితే వీటిని అధిగమించగలం. సిబ్బందికి శిక్షణను కూడా అందజేస్తున్నాం. బ్యాంకు మేనేజర్లు, వ్యాపార ప్రతినిధులు శిక్షణ ఇస్తున్నారు’ అని ఆర్థిక మంత్రి చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more