రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయటానికి సోనియా గాంధీ కొత్త ప్రణాళిక రూపోందించినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఎలగైన ప్రధానిని చేయాలనేదే ఆమె ప్రధాన అంశంగా ఢిల్లీ నాయకులు చెబుతున్నారు. అందుకోసం ముందుగానే సోనియా సరికొత్త ప్రణాళికలను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దేశంలో జరుగుతున రాజకీయ పరిస్థితులను సోనియా గాంధీ ద్రుష్టిలో పెట్టుకొని తన పార్టీ నాయకులను రెఢీ చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. 2014 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ముందుగానే రెఢీ అవుతుంది. ముందుగా 2013 లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవటం జరుగుతుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ కు ప్రధాన సమస్యగా ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ను ఎన్నికల తరువాత ఇస్తామని చెప్పి, టీఆర్ఎస్ కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయటమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఢిల్లీ నాయకులు చెబుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీనాయకులతో కలిసి పోటీ చేసేందుకు 20 వేల కోట్లు ఒప్పందం కుదిరినట్లు ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు చెవులు కోర్కుకుంటున్నారు. ఈ ఒప్పందానికి టీఆర్ఎస్ నాయకులు ఒప్పుకోవటం జరిగిందని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇటు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ కి పోటీగా తెలుగు దేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో లోక్ సభకు పోటీ చేసి 20 నుంచి 30 స్థానాలు గెలుచుకోవటం జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులు చెబుతున్నారు. ముందుగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మద్దతుతో గెలిచి ఢిల్లీ లో తన స్థానం దక్కించుకోవటానికి సోనియా గాంధీ వేసిన కొత్త ప్లాన్ అని ఢిల్లీ నాయకులు చెబుతున్నారు. అయితే 2014 లో జరిగే శాసన సభ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని అసెంబ్లీ స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ మూడో సారీ విజయం సాధించేందు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇలా చేయటం ద్వారా రాహుల్ గాంధీ ప్రధాని కావటానికి ఎలాంటి అటకం ఉండదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా బీజేపి పార్టీ నాయకుల మద్య ఏర్పాడిన వివాదాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ సినీయర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు. జగన్ తో పొత్తు పెట్టుకొని గెలిచిన తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవటం ఖాయమాని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ , జగన్ కలిసి 2014 ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్దమవుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నిర్ణయిస్తారో చూడాలి?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more