Barack obama and mitto romney push to the finish

america election, us presidential candiates, us elections, obaman and romney, presidential polls, barack obaman, mitt romne, us voters, billclinton support to obama, obama wife michelle, michelle, mitto wife ann romney, ann romney, america, sandy, billclinton,

Barack Obama and Mitto Romney push to the finish

Barack.gif

Posted: 11/06/2012 11:05 AM IST
Barack obama and mitto romney push to the finish

Barack Obama and Mitto Romney push to the finish

నిన్నటి వరకు అమెరికాను శాండి అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే.  శాండీ తుపాన్ నుంచి తేరుకుంటున్న అమెరికా  ప్రజలు  ఇప్పుడు మరో దాని పై ద్రుష్టి పెట్టారు.   నాయకుడు కోసం జరుగుతున్న ఎన్నికల్లో  ఎవరు అధినేత అవుతారో అని అమెరికా ప్రజలు  నిర్ణియిస్తారు.   అక్కడ ప్రజలు  పాత నాయకుడికి మళ్లీ అవకాశం ఇస్తారా? లేక  కొత్త నాయకుడ్ని ఎన్నుకోంటరా అనేది ఈ ప్రపంచం  మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రపంచ దేశాలను శాసించే పదవిగా పేరొందిన అధ్యక్షపదవికోసం మళ్లీ పోటీపడుతున్న డెమోక్రెటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రిపబ్లికన్‌ పార్టీ తరపున బరిలో ఉన్న ప్రత్యర్థి మిట్‌ రోమ్నిలలో ఎవరిని అదృష్టం వరిస్తుందో నేడు తేలనుంది. ఇరు అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా అనేక ర్యాలీల్లో, నగరాల్లో ఏర్పాటుచేసిన సమావేశాల్లో పాల్గొన్నారు. పార్టీకోసం భారీగా నిధుల సమీకరణ చేశారు. మరోపక్క ఓటర్లను అకట్టుకోవటంకోసం, ప్రకటనలపై పలుకార్యక్రమాలపై, పర్యటనలపై బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించారు. ఈ సందర్భంగా ఇరు నేతలు మూడుసార్లు ప్రత్యక్ష చర్చల్లో పాల్గొన్నారు. కాగా, ఉపాధ్యక్షుడి పదవికోసం బరిలో ప్రస్తుత వైస్‌ ప్రెసిడెంట్‌ జో బిడెన్‌(డెమొక్రెటిక్‌ పార్టీ) రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు పాల్‌ ర్యాన్‌లు తమ బాస్‌లకు మద్దతుగా ప్రచారంలో నిర్వహించారు.అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఫస్ట్‌ లేడి మిచెల్లీ ఒబామా, రోమ్నీ భార్య అన్న్‌ రోమ్మీలు తమ భర్తల తరపున కీలక పాత్రలను పోషించారు. తమ విధానాలపై ఇంకా ఏమీ నిర్ణయించుకోని ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి చివరిరోజైన ఇరు అభ్యర్థులు ప్రయత్నంచేశారు.

Barack Obama and Mitto Romney push to the finish

అమెరికాను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి... సరైన నేత ఆధ్వర్యంలో సాగడానికి ఎవరికివారు తమనే గెలిపించమని ఓటర్లను కోరారు. అయితే సర్వేలో భాగంగా చేపట్టిన పోల్స్‌లో ఒబామాకు, రోమ్నీకు సమానంగా ఓట్లు రావటంతో... ఇరు అభ్యర్థులు తమతమ కీలక మద్దతుదారుల అదరణను పొందడానికి చర్యలను తీవ్రం చేశారు. చివరి దఫా సాగిన ప్రచారంలో రోమ్నీ ఇండియానాపాయిస్‌, ఇండియానాలో ప్రసంగించగా, ఒబామా ఓహియోలోని మెంటర్‌లో సాగిన ర్యాలీలో ప్రసంగించారు. ‘ ఓహియో... మీరు నాకు కావాలి’ అని సిన్‌సినాటిలో ఇరవైవేల తన మద్దతుదారులనుద్దేశించి అన్నారు. ఇక్కడ ఒబామా, రోమ్నీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. నాతో పనిచేయాలని మీరు కోరుకుంటున్నట్లైతే.. నాతో పాటు కొంతమందిని ప్రభావితం చేయండి. ఒకవేళ, మీరు ముందే ఓటేయ దలిస్తే.. నాకోసం కొంతమందికి ఫోన్‌ కాల్స్‌ చేసి నాకు ఓటువేసేలా చేయండి. మనం ఓహియోను గెలుచు కుంటాం. అదేవిధంగా ఈ ఎన్నికల్లో గెలుస్తాం’ అని ఒబామా తన ప్రసంగంలో అన్నారు.  ఇరు అభ్యర్థులు రాత్రి సమయంలో కూడా ప్రచారాన్ని చేశారు. పోటీ తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రచారాన్ని చేస్తూ రోమ్నీ.. శ్వేత సౌధంలో ప్రవేశించే అభ్యర్థిగా తనను గెలిపించమని రోమ్నీ తన మద్దతుదారులను కోరారు. ‘ వచ్చే రోజుల్లో మనంచేయాల్సిన పని అతి స్వల్పంగా ఉంది. గెలుపు మనదేనని మీరు చెప్పాలి’ అని అని రోమ్నీ వర్జీనియాలో చేపట్టిన ఒక ర్యాలీలో ఉద్వేగంగా ప్రసంగించారు.కాగా.. చిట్టచివరి ప్రచారంలో ఒబామాతో పాటు డెమొక్రాటిక్ స్టార్ ప్రచారకర్త బిల్‌క్లింటన్ కూడా పాల్గొనగా, రోమ్నీ ఒంటరిగా పెన్సిల్వేనియా వెళ్లారు. "మేం బాగా పనిచేయగలమని మీరు నమ్మితే, అమెరికా ఇంకా బాగుపడాలని మీరు అనుకుంటే, అసలైన మార్పు కోసం ఓటు వేయండి. మొట్టమొదటి రోజు నుంచే అసలైన మార్పు ఏంటో నేను, పాల్‌ర్యాన్ చూపిస్తాం'' అని రోమ్నీ అన్నా రు.

Barack Obama and Mitto Romney push to the finish

అంతకుముందు ఎన్నికల్లో ఎన్ని హామీలిచ్చినా వాటిని నెరవేర్చడంలో ఒబామా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. అయితే రోమ్నీ ఆరోపణలను ఒబామా, క్లింటన్ ఇద్దరూ ఖండించారు. రోమ్నీని 'సేల్స్‌మన్'గా అభివర్ణించిన ఒబామా, ఆయన పాత ఆలోచనలను కొత్తగా చూపించేందుకు వాటిని మళ్లీ ప్యాకింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నన్ను ఎన్నుకుంటే ప్రతి సమస్యా పరిష్కారం అవుతుందని నేను అధ్యక్షుడిగా చెబుతున్నాఅన్నారు. అమెరికాలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు జరిగే ఎన్నికల్లో ఆరుగురు ఎన్నారైలు పోటీలో ఉన్నారు. వీరిలో ముగ్గురికి విజయావకాశాలు కూడా బాగున్నాయి. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ జిల్లా నుంచి డాక్టర్ అమీ బెరా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయనకు విజయావకాశాలు బాగున్నాయి. ఇక కాలిఫోర్నియాలోని తొమ్మిదో కాంగ్రెషనల్ జిల్లాకు రికీ గిల్ పోటీ చేస్తున్నారు. ఇక బీహారీనేత సయ్యద్ షాబుద్దీన్ తమ్ముడు డాక్టర్ సయ్యద్ తాజ్ మిచిగన్‌లోని 11వ కాంగ్రెషనల్ జిల్లాకు పోటీలో ఉన్నారు. పెన్సిల్వేనియాలోని ఆరో కాంగ్రెషనల్ జిల్లాకు రెండోసారి డాక్టర్ మనన్ త్రివేదీ పోటీ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi new plans in lok sabha elections
Congress tdp leaders joined in ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more