Sumathi Satakam in Telugu 42973 Sumathi Satakalu

Sumati shatakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu అధరము కదిలియు గదలక

Get the Sumathi Satakam అధికారం వచ్చి కళ్ళు మూసుకుపోయాయి అని సాధారణంగా అంటుంటారు. కానీ కళ్ళు మాత్రమే కాదు చెవులు, నోరు కూడా పనిచెయ్యదని సుమతీ శతకకర్త అంటున్నారు. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం

Posted: 03/13/2013 05:57 PM IST
Sumati shatakam

అధరము కదిలియు గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముజూడ బాపము సుమతీ

హృదయానికి హత్తుకుని చాలా కాలం వరకూ దాని ప్రభావం ఉండటం కోసం శతకాలలో చాలా వాడియైన పదాలను ఉపయోగించారు.  అధికార గర్వంతో ఉన్నవారి గురించి చెప్తూ, దాన్ని రోగంతో పోల్చారు శతకకర్త.  
పలకరిస్తే ముఖంలో నవ్వు కానీ, పూర్తిగా నోరు తెరచి మాట్లాడటం కానీ లేకుండా, మాట్లాడకుండా తలాడించటం కానీ లేకపోతే పలికిన పలుకులు కూడా ములుకుల్లా గుచ్చుకునేట్టుగా మాట్లాడేవాడు భాషను మర్చిపోయాడా లేదంటే మౌనవ్రతంలో ఉన్నాడా అనేట్టుగా ఉంటాడట.  అటువంటి అధికార రోగం వచ్చిన వాడు ఒక్క మాటలు రాకపోవటమే కాకుండా, చెవులు వినిపించక, కళ్ళు కూడా కనిపించని రోగ లక్షణాలు కూడా ఉంటాయంటూ అటు కఠినమైన పదజాలంతో ఇటు హాస్యాన్ని కూడా మేళవించి చెప్పారు.  
అధికారం వచ్చి కళ్ళు మూసుకుపోయాయి అని సాధారణంగా అంటుంటారు. కానీ కళ్ళు మాత్రమే కాదు చెవులు, నోరు కూడా పనిచెయ్యదని సుమతీ శతకకర్త అంటున్నారు.  
అంతేకాదు ముక్తాయింపుగా అటువంటి శవాన్ని చూస్తేనే పాపమని కూడా అంటున్నారు.  రోగభూయిష్టమే కాకుండా గర్వంతో కూడిన అటువంటి వ్యవహారశైలి గలవారు చచ్చిన శవంతో సమానమని, అటువంటి శవాన్ని చూసినా పాపమే అంటుకుంటుందని అన్నారు.  
సాధారణంగా చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడరు.  తెలిసినవారూ తెలియనివారూ కూడా శవాన్ని చూసి వెళ్తారు.  అయితే శవమే అనిపించే అధికార రోగం ఉన్నవారిని కంటితో చూసినా కూడా పాపం సుమా అంటే నిజంగా పాపం అంటుకుంటుందని కాదు.  అలా ఉండకూడదన్న విషయాన్ని గట్టిగా చెప్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Sumati shatakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more