Sumathi Satakam in Telugu 42677 Sumathi Satakalu

Sumati shatakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ధనపతి- లక్ష్మీదేవి భర్తైన విష్ణుమూర్తి, సఖుడైయుండియు- స్నేహితుడే అయినా, శివుడు భిక్షమెత్తగ వలసెన్- శివుడికి బిక్షమెత్తుకోవలసిన అవసరం ఏర్పడింది. తనవారికెంత కలిగిన- తనవాళ్ళకి ఎంత ఉన్నా, దనభాగ్యమె తనకు- తను నిజంగా కలిగివున్నదే తనకు దక్కుతుంది.

Get the Sumathi Satakam మావాళ్ళు విదేశాల్లో ఉన్నారు, మావాళ్ళు రాజకీయాల్లో చెలామణి అవుతున్నారు, మావాళ్ళు పోలీసు శాఖలో ఉన్నారు అంటూ కొందరు గొప్పలు చెప్పుకుంటారు. అవి చెప్పుకునేంత వరకే కానీ ఎవరికి కలిగింది వారికే అనుభవంలోకి వస్తుంది. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం

Posted: 03/01/2013 04:58 PM IST
Sumati shatakam

ధనపతి సఖుడైయుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దనవారికెంత గలిగిన
దన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ

ప్రతిపదార్ధం:
ధనపతి- లక్ష్మీదేవి భర్తైన విష్ణుమూర్తి, సఖుడైయుండియు- స్నేహితుడే అయినా, శివుడు భిక్షమెత్తగ వలసెన్- శివుడికి బిక్షమెత్తుకోవలసిన అవసరం ఏర్పడింది. తనవారికెంత కలిగిన- తనవాళ్ళకి ఎంత ఉన్నా, దనభాగ్యమె తనకు- తను నిజంగా కలిగివున్నదే తనకు దక్కుతుంది.

తాత్పర్యం:
సాక్షాత్తూ లక్ష్మీదేవి భర్తైన విష్ణువు తనకు సన్నిహితుడైనా, శివుడు భిక్షమెత్తుకున్నాడు.  ఎవరికైనా తన భాగ్యంలో ఉన్నదే తనకి దక్కుతుంది కానీ, ఎంత దగ్గరివారైనా వాళ్ళ భాగ్యం వీళ్ళకి దక్కదు.

వివరణ:
మావాళ్ళు విదేశాల్లో ఉన్నారు, మావాళ్ళు రాజకీయాల్లో చెలామణి అవుతున్నారు, మావాళ్ళు పోలీసు శాఖలో ఉన్నారు అంటూ కొందరు గొప్పలు చెప్పుకుంటారు.  అవి చెప్పుకునేంత వరకే కానీ ఎవరికి కలిగింది వారికే అనుభవంలోకి వస్తుంది.  ఒకే ఇంట్లో కలిసే ఉన్నా ఎవరి ఆరోగ్యం వాళ్ళదే, ఎవరి ఆకలి వాళ్ళదే, ఎవరికి అరిగి జీర్ణమయ్యేది వాళ్ళకే.  అందువలన ఎవరికి వారు వాళ్ళ వనరులను, వాళ్ళ అవగాహనను, వాళ్ళ కృషిని, వాళ్ళ ఙానాన్ని వాళ్ళు పెంచుకోవాలి కానీ ఇతరుల మీద ఆధారపడదామనుకుంటే అది వీళ్ళ చేతికి అందకపోవచ్చు కాబట్టి అలా ఎవరి సంపదల మీదనో, తేరగా వచ్చే దానిమీదనో ఆశపెట్టుకోవటం సరైనది కాదని ఈ పద్యంలోని నీతి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati shatakam
Sumati shatakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more