ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కైవిడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ
ఉపమింప- పోల్చి చూసినట్లయితే, మొదలు తియ్యన- మొదట్లో తియ్యగానే ఉంటుంది, కపటపు- మోసం చేసే గుణం ఉన్న, ఎడనెడన్- పోనుపోను, చెఱకుకైవడిన్ ఏపో- చెరుకు గడలాగానే ఉంటుంది సుమా, నెపములు వెదకును- తప్పులు వెదుకటం జరుగుతుంది, కడపట- కాలం గడుస్తుంటే, దుర్జాతి పొందు- దుర్మార్గునితో సావాసం.
చెరుకు తినటం మొదలుపెట్టినప్పుడు చాలా తియ్యగా ఉంటుంది కానీ తినగా తినగా చప్పగా ఉండే పిప్పి మిగులుతుంది. మొసగాడు, దుర్మార్గుడు అయిన వాడితో స్నేహం చేస్తే ముందు బాగానే ఉంటుంది కానీ రాను రాను తప్పులు వెదకటంతో ఆ స్నేహం కాస్తా అంతరిస్తుంది.
స్నేహం చేసేటప్పడు జాగ్రత్త అని చెప్తున్నారు శతక కర్త. మీరు మంచి ఉద్దేశ్యంతోనే స్నేహం చెయ్యవచ్చు. మీది మంచి మనసు కాబట్టి స్నేహానికి విలువనిస్తూ స్నేహితుడిని పూర్తిగా నమ్ముతూ ఉండవచ్చు కానీ దుర్మార్గుడితో స్నేహం ముందు తియ్యగా ఉండి రానురాను అసలు స్వరూపం బయటపడుతుంది అని చెప్పటానికి చెరకు గడ పోలిక తీసుకున్నారు. ఈ కాలంలో బబల్ గమ్ పోలిక తీసుకోవచ్చు. బబల్ గమ్ నోట్లో పెట్టుకున్నప్పుడు తియ్యగా ఉంటుంది కానీ కాసేపటికి దాని పైపూతంతా పోయి చప్పటి గమ్ మిగులుతుంది. ఇది ఇంగ్లీష్ గమ్ అంటే జిగురు. హిందీలో గమ్ కూడా మిగులుతుంది. హిందీలో గమ్ అంటే దుఖ్ఖం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more
Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more
Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more
Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more
Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more