Bypoll in Munugode Assembly on Nov 3 మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల..

Munugode by poll politics heat up further as ec announces by election schedule

Bypoll Munugode constituency, Election Commission of India, Munugode, Munugode by poll, Munugode byelection, bjp telangana, congress telangana, munugode bypoll trs, Komatireddy Rajgopal Reddy, Bahujan Samaj Party, Telangana Rashtra Samithi, munugode assembly constituency, munugode bypoll election, munugode bypoll candidates, munugode bypoll congress, Bypoll Telangana, Bypoll in Telangana’s Munugode, Telangana bypoll dates, Telangana bypoll news, Telangana

The Election Commission of India announced Monday that the bypoll for the Munugode Assembly constituency in Telangana would be held on November 3. The panel also announced bypolls to six other vacant Assembly seats in five states on the day. A Gazette notification in this regard will be issued on October 7 and the last date for filing of nominations will be October 14. The election will be held on November 3 and the counting of votes on November 6.

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ఎప్పుడంటే..?

Posted: 10/03/2022 03:42 PM IST
Munugode by poll politics heat up further as ec announces by election schedule

నల్లగొండ జిల్లా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జిల్లా పరిధిలోని మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఇవాళ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించడంతో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపోందిన కోమటిరెడ్డి రాజమోహన్ రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీ సభ్యత్వంతో పాటు అసెంబ్లీ శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.

మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ ఉపఎన్నికల కోసం ఇప్పటికీ అభ్యర్థులు ఖరారు కాకపోయినా.. త్రిముఖ పోటీ మాత్రం నెలకొంది. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని ఖరారు చయగా, బీజేపి నుంచి కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవనున్నారు. కాగా రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ అక్కడ అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయినా ప్రచారం మాత్రం పార్టీ తరపున కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్నది.

ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్నది. 15న నామినేషన్లను పరిశీలించనుండగా.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. నవంబర్‌ 3న ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా.. 6న ఓట్లను లెక్కించనున్నారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గానికి ఎన్నిక జరుగనున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles