Petrol Pump Owner Escapes Kidnapping Attempt In UP వారణాసీలో పెట్రోల్ బంకు యజమాని కిడ్నాప్ చేయబోయి..

Caught on camera petrol pump owner escapes kidnapping attempt in up

Kidnap bid foiled, abduction bid foiled, petrol pump owner, petrol pump security guard, staff members, CCTV footage, Tarna area, Shivpuri, Varanasi, Uttar Pradesh, Crime

Four people in a SUV tried to kidnap a petrol pump owner in Varanasi after an argument broke out between them, officials have said. The incident was reported from Tarna area of Shivpuri. After refuelling the vehicle, the accused tried to kidnap the petrol pump owner, but their abduction bid was foiled after the staff members intervened.

ITEMVIDEOS: వారణాసీలో పెట్రోల్ బంకు యజమాని కిడ్నాప్ చేయబోయి..

Posted: 10/03/2022 02:13 PM IST
Caught on camera petrol pump owner escapes kidnapping attempt in up

నేరగాళ్లు తమ నేరాలకు కొత్త బాష్యాలు చెబుతూ కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఒక్కప్పుడు కిడ్నాప్ లు, గట్రాలు చేయాల్సిన సమయంలో ఏదో నమ్మకాలతో తీసుకెళ్లి తరువాత కుటిల బుద్దిని బయటపెట్టే రోజులు పోయి.. బాహాటంగా అందరి ఎదుట నేరాలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో నేరాలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని పాలకపక్ష నేతలు ఎన్ని గొప్పలకు పోయినా.. నేరాలు మాత్రం ఇప్పటికీ అధికంగానే నమోదవుతున్నాయి. ఒక పెట్రోల్ బంకు యజమానిని అపహరించే తరుణంలో ఆ బంకు సిబ్బంది ఎలా అడ్డుకున్నారన్న నేపథ్యంలో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియో అక్కడి నేరాలు జరుగుతున్న క్రమానికి అద్దం పడుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పెట్రోల్‌ బంక్‌ యజమానిని కిడ్నాప్‌ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించగా, బంక్‌లో పని చేసే సిబ్బంది, ఇతరులు అడ్డుకుని అతడ్ని కాపాడారు. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో.. అందులోనూ ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసిలో ఈ సంఘటన జరిగింది. శివపురిలోని తర్నా ప్రాంతంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్దకు నలుగురు వ్యక్తులు ఎస్‌యూవీలో వచ్చారు. కారులో పెట్రోల్‌ నింపుకున్న తర్వాత పెట్రోల్‌ బంక్‌ యజమానితో ఒక వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. మరో ఇద్దరు వ్యక్తులు కారును తమ వద్దకు తీసుకుని రావాలంటూ డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తికి సైగ చేశారు.

దీంతో ఆ కారు వారి వద్దకు రాగా పెట్రోల్‌ బంక్‌ యజమానిని బలవంతంగా అందులోకి ఎక్కించి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారు. కాగా, దీనిని గమనించిన పెట్రోల్‌ బంక్‌లో పని చేసే సిబ్బంది వెంటనే స్పందించారు. కారు వద్దకు పరుగెత్తుకుని వెళ్లి యజమానిని కిడ్నాప్‌ చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అక్కడ ఉన్న కస్టమర్లతో కలిసి అతడ్ని కాపాడారు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు కారులో అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు పెట్రోల్‌ బంక్‌ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడున్న సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేస్తామని పోలీస్‌ అధికారి తెలిపారు. కాగా, సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles