Rahul Gandhi Says Nothing Can Stop Bharat Jodo Yatra ‘భారత్ జోడో’ యాత్రను ఎవరూ ఆపలేరు: జోరు వానలోనూ రాహుల్ ప్రసంగం

Crowd cheers as rahul gandhi addresses rally amid heavy rains in mysuru

Rahul Gandhi in Rain, Rahul Gandhi rally in Rain, Rahul Gandhi rally in mysure rally, mysore congress rally in rally, rahul gandhi rally in rain, Rahul Gandhi, Rains, Mysore, Mysuru, Rahul Gandhi rally in Mysuru, Bharat Jodo Yatra, Rahul Gandhi, Bangalore, Karnataka, Politics

Congress leader Rahul Gandhi said nothing can deter the Bharat Jodo Yatra which is aimed at "stopping hatred and violence spread by the BJP-RSS", as he addressed a public meeting in heavy rains here. Soon after Rahul Gandhi arrived at the public meeting at the end of the day's march, the showers started but Rahul Gandhi chose to continue his speech.

ITEMVIDEOS: ‘భారత్ జోడో’ యాత్రను ఎవరూ ఆపలేరు: జోరు వానలోనూ రాహుల్ ప్రసంగం

Posted: 10/03/2022 01:17 PM IST
Crowd cheers as rahul gandhi addresses rally amid heavy rains in mysuru

దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజిస్తూ.. విద్వేషాలతో సాగుతున్న పాలనకు చరమగీతం పాడి.. యావత్ భారత్ ఒక్కటని.. భారతీయులంతా అన్నదమ్ములన్న భావనను తిరిగి దేశవ్యాప్తంగా ఇనుమడింపజేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని అన్ని విభజనవర్గాల నుంచి ఏకం చేయడంలో తమను ఎవరూ ఆపలేరని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. జోరువాన హోరుగా కురుస్తున్నా.. ఏ మాత్రం వెనక్కు తగ్గని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ్యలో జయహో కాంగ్రెస్ పార్టీ అంటూ నినదించే కార్యకర్తల హోరు ఏమాత్రం తగ్గలేదు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు ఆయన చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర 25వ రోజున మైసూరులో కొనసాగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం ఆయనతోపాటు ముందుకు సాగారు. సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షంలోనూ ప్రసంగిస్తున్న రాహుల్‌ను చూసి జనం కరతాళ ధ్వనులతో మరింత ఉత్సాహాన్ని నింపారు. వర్షం కురుస్తుండగానే పార్టీలో చేరిక ప్రక్రియ కొనసాగింది. జోరు వర్షంలోనూ ప్రసంగాన్నికొనసాగించిన రాహుల్ అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

‘‘భారత్‌ను ఏకం చేయడంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. భారత గొంతుకను వినిపించడంలో ఎవరూ మమ్మల్ని నిలువరించలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిగే యాత్రను ఎవరూ ఆపలేరు’’ అని ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించారు. కాగా, గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ అంతకుముందు ఖాదీ గ్రామోదయ కేంద్రంలో మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్నవారు గాంధీ సిద్ధాంతాలను బాగానే వల్లిస్తున్నారని, కానీ ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం వారికి కష్టంగా ఉందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles