Congress worker punched, made to take off 'PayCM' t-shirt ‘పేసీఎం’ టీషర్ట్‌ ధరించిన కాంగ్రెస్‌ కార్యకర్తపై పోలీసుల దాడి.!

Congress worker made to take off paycm t shirt punched by police at bharat jodo yatra

Bharat Jodo Yatra, Bharat Jodo Yatra, Rahul Gandhi, Siddaramaiah, ShivaKumar, Pay CM, Pay CM t-shirt, Congress Worker, Congress Worker Akshay kumar, Congress Worker punched, Congress Worker made to take off T Shirt, Congress Worker Pay CM T Shirt, Karnataka CM Basavaraj Bommai, Pay CM, Pay CM t-shirt, Congress, Karnataka government, Basavaraj Bommai, Karnataka, Politics

During the second day of Congress’s Bharat Jodo Yatra in Karnataka, the police arrested a Congress worker wearing a ‘Pay CM’ t-shirt. The arrested was identified as Akshay Kumar, a Congress worker from Vijayapura, who had come to take part in the Bharat Jodo Yatra led by Rahul Gandhi.

ITEMVIDEOS: ‘పేసీఎం’ టీషర్ట్‌ ధరించిన కాంగ్రెస్‌ కార్యకర్త.. పిడిగుద్దులు కొట్టి.. విప్పించిన వైనం

Posted: 10/01/2022 04:07 PM IST
Congress worker made to take off paycm t shirt punched by police at bharat jodo yatra

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక పోలీసుల జులుం ప్రదర్శించారు. ప్రజాస్వామ్యం దేశంలో రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాయడంతో పాటు నడిరోడ్డు మీద ఓ వ్యక్తి మెడపై పిడిగుద్దులు గుద్దుతూ తమ అరచకాన్ని చాటారు. ప్రజలు శాంతియుతంగా తమ నిరసనను తెలిపే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను రాజ్యాంగం కల్పించినా.. దానిని కాలరాస్తూ తమ ఇష్టానుసారమే నడవాలని కొత్త శాసనాన్ని లిఖించారు. ఓ ర్యాలీలో కాంగ్రెస్‌ కార్యకర్త ధరించిన ‘పే-సీఎం’ టీషర్ట్‌ను బలవంతంగా విప్పించారు. అతడిపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’, బీజేపీ పాలిత తొలి రాష్ట్రమైన కర్ణాటకకు చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్త అక్షయ్ కుమార్ ‘భారత్ జోడో యాత్ర’లో శనివారం పాల్గొన్నాడు. ‘PayCM’ అని రాసి ఉన్న టీ-షర్టును అతడు ధరించాడు. దీనిని గమనించిన పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్త అక్షయ్‌ కుమార్‌ ధరించిన టీ షర్ట్‌ను బలవంతంగా విప్పించారు. అలాగే పోలీసులు అతడిపై పిడికిలితో పంచ్‌లు ఇచ్చారు. మరోవైపు మీడియా రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్‌ను కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘పేసీఎం’ టీ-షర్టు ధరించిన తమ కార్మికుడిపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది.

ఆ వ్యక్తి టీషర్ట్‌ను తొలగించి దాడి చేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించింది. వీరు పోలీసులా లేక గూండాలా? అని విమర్శించింది. దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, ఆయన ప్రభుత్వం ప్రజా పనులపై 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఆరోపించింది. కాంట్రాక్టర్ల ఆత్మహత్యాయత్నం కేసుల సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో క్యూఆర్‌ కోడ్‌ కలిగిన ‘PayCM’ పేరుతో ఉన్న పోస్టర్లు ఆ రాష్ట్రంలో పలు చోట్ల వెలిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles