PM Modi test driving a car in Europe from Delhi using 5G ఢిల్లీలో కూర్చోని స్వీడన్ లో కారును డ్రైవ్ చేసిన ప్రధాని మోడీ

Modi launches 5g says will change the structure of internet

PM Modi, PM Modi 5G, 5G launch in India, 5G launch date in India, jio 5G, jio 5G network, jio 5G launch date, jio 5G sim, jio 5G phone, jio 5G plans, jio phone 5G, jio 5G launch date in India, airtel 5G launch date in India, jio 5G sim launch date, 5G India, 5G launch in India date, PM Modi, Narendra Modi, PM Narendra Modi, launch of 5G services, 5G services in India, 5G launch, airtel, jio, vodafone, airtel 5G launch date, 5G network in India, 5G mobile, 5G latest news in India, National business

Prime Minister Narendra Modi on Saturday conducted a test drive of a car in Europe from Delhi's Pragati Maidan, using the newly launched 5G technology. Union minister Piyush Goyal tweeted the photo and wrote, "India driving the world'. PM Modi inaugurated the India Mobile Congress 2022 exhibition before he launched the 5G mobile telephony services in India.

ITEMVIDEOS: 5జీ సేవలు: ఢిల్లీలో కూర్చోని స్వీడన్ లో కారును డ్రైవ్ చేసిన ప్రధాని మోడీ

Posted: 10/01/2022 02:35 PM IST
Modi launches 5g says will change the structure of internet

5జీ టెలికాం సేవ‌ల‌ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. ఇండియ‌న్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. 21వ శ‌తాబ్ధంలో భార‌త్‌కు ఇది చ‌రిత్రాత్మ‌క దిన‌మ‌న్నారు. టెలికాం రంగంలో 5జీ సేవ‌లు విప్ల‌వాత్మ‌క మార్పులు తేనున్న‌ట్లు తెలిపారు. 5జీని ఆవిష్క‌రించ‌డం అంటే.. 130 కోట్ల మంది భార‌తీయుల‌కు ఇది టెలికం రంగం ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు. ఈ దేశంలో కొత్త శ‌కానికి ఇదో ముందడుగు అన్నారు. అప‌రిమిత అవ‌కాశాలకు కూడా ఇది ఆరంభ‌మే అని ప్ర‌ధాని తెలిపారు. 5జీ టెక్నాల‌జీ విష‌యంలో న‌వ‌భార‌త్ కేవ‌లం ఓ వినియోగ‌దారుడిగా ఉండిపోదు అని, ఆ టెక్నాల‌జీ అభివృద్ధి విష‌యంలోనూ యాక్టివ్ పాత్ర పోషిస్తుంద‌న్నారు.

ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదాన్‌లో శ‌నివారం ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) వేదిక‌గా 5జీ సేవ‌ల‌ను ప్రారంభించిన అనంతరం అక్క‌డ ఏర్పాటు చేసిన ఎరిక్స‌న్ స్టాల్ ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సందర్శించారు. అక్కడి నుంచి 5జీ క‌నెక్ష‌న్ ద్వారా రిమోట్ మోడ్‌లో ప్ర‌ధాని మోదీ స్వీడ‌న్‌లో కారును డ్రైవ్ చేశారు. యూర‌ప్‌లోని ఇండోర్ కోర్స్‌లో వాహ‌నాన్ని ఉంచ‌గా కంట్రోల్స్ ఇవ్వ‌డం ద్వారా కారును న‌డిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ రిల‌య‌న్స్ పెవిలియ‌న్‌ను సంద‌ర్శించి జియో గ్లాస్ ద్వారా ట్రూ 5జీ డివైజ్‌ల‌ను ప‌రిశీలించారు.

ఇక భార‌త్‌లో 5జీ సేవ‌ల‌ను ప్ర‌ధాని లాంఛ‌నంగా ప్రారంభించ‌డంతో యూజ‌ర్లు దీపావ‌ళి నుంచి 5జీ సేవ‌ల‌ను ఆస్వాదించ‌నున్నారు. ప్ర‌పంచంలో సాంకేతిక అభివృద్ధిలో ఇండియా ఇక దూసుకువెళ్తుంద‌ని ప్ర‌ధాని ఈ సందర్భంగా తెలిపారు. ఎయిర్‌టెల్‌, రిల‌య‌న్స్ జియో వంటి టెలికాం కంపెనీలు త్వ‌ర‌లో 5జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ 23 నాటికి దేశం న‌లుమూల‌లా అన్ని ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో జియో సేవ‌లు ప్రారంభిస్తామ‌ని ఐఎంసీ వేదిక‌పై ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ వెల్ల‌డించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles