Young man ends life in Prakasam district ‘‘శివుడు పిలుస్తున్నాడు.. వెళ్తున్నా..’’ ప్రకాశం జిల్లా యువకుడు ఆత్మహత్య..

Young man ends life in prakasam district of andhra pradesh

Venkata Purna Shekhar Reddy, young man of Chatlamada, young man of Peddaravidu mandal, young man of Prakasam district, young man of Andhra Pradesh, younger sister Sailakshmi, Lord Shiva, evil society, Chennai, Job, Chatlamada, Peddaravidu mandal, Prakasam, Andhra Pradesh, Crime

A young man Venkata Purna Shekhar Reddy of Chatlamada, in Prakasam district of Andhra pradesh, committed suicide saying that he was called by Lord Shiva asking him not to stay in this evil society. The incident which took place in Chatlamada of Peddaravidu mandal of Prakasam district became a sensation.

‘‘శివుడు పిలుస్తున్నాడు.. వెళ్తున్నా..’’ ప్రకాశం జిల్లా యువకుడు ఆత్మహత్య..

Posted: 09/26/2022 05:26 PM IST
Young man ends life in prakasam district of andhra pradesh

‘‘దేవుడు పిల్లుస్తున్నాడు.. వెళ్తున్నా..’’ అంటూ ఓ యుక్తవయస్సుతోని నవయువకుడు తన స్వగ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పాపపు లోకములో ఉండాల్సిన అవసరం లేదని రమ్మని శివయ్య పిలుస్తున్నాడు. ఈ జీవితాన్ని సమాస్తం చేసుకుంటేనే కనీసం వచ్చే జన్మలోనైనా లోకాన్ని మార్చేలా ఉన్నతమైన జీవితాన్ని శివయ్య కల్పించాలని తాను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ తన తండ్రి కూడా శివ భక్తుడని, ఆయనను కూడా కొన్నేళ్ల క్రితం శివయ్య తనలో ఐక్యం చేసుకున్నాడని, అందుకనే తాను శివయ్య లోకానికే వెళ్తున్నానని పేర్కోంటూ ఓ లేఖ రాశాడు.

తన మరణానికి ఎవరూ బాధ్యులుకారని, తనను శివయ్య పిలవడంవల్లే తాను వెళ్తున్నానని చెబుతూ ఓలేఖ రాశాడు. అయితే తన చిన్నారి చెల్లి శ్రీలక్ష్మీని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని ఆ లేఖలో తన బంధువులను కోరాడు. కాగా యువకుడి తల్లి అతని ఆకాల మరణంతో కన్నీరు మున్నీరైంది. తండ్రి మరణానంతరం కుటుంబ బాధ్యతను తన భుజాలపై ఎత్తుకున్న యువకుడు మళ్లీ తమను ఒంటరిని చేసి వెళ్లిపోయాడని అమె గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పెద్దరావీడు మండల పరిధిలోని చట్లమడ ఆమ్మెల్ గ్రామంలో చోటుచేసుకుంది.

కాగా వెంకట పూర్ణ శేఖర్ రెడ్డి అనే యువకుడు తన కుటుంబాన్ని పోషించేందుకని తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడని.. అలాంటి యువకుడు అనుకోకుండా స్వగ్రామానికి వచ్చి తన ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే యువకుడు లేఖలో రాసినట్లుగానే ఆ కుటుంబం శివయ్యను ఆరాధిస్తోంది. కాగా, ఆయన కొన్నేళ్ల కిత్రమే మరణించడంతో ఉన్నత విద్యను మానేసిన యువకుడు కుటుంబ పోషణ నేపథ్యంలో చెన్నైకి వెళ్లి ఉద్యోగం చేసి.. తల్లిని, చెల్లికి పట్టెడన్నం పెట్టాడు. అలాంటిది ఆకస్మాత్తుగా తిరిగివచ్చి ఇలా విపరీత నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటన్నది తేలియలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles