Wildlife Protection Act violiation, FIR on CM వన్యప్రాణుల చట్టానికి తూట్లు.. సీఎం, సద్గురుపై కేసులు

Complaint against sadhguru assam cm for jeep safari in kaziranga national park

Kaziranga National Park, Sadhguru Jaggi Vasudeva, Isha Foundation, Assam CM Himanta Biswa Sarma, Jayanta Malla Baruah, Wildlife Protection Act, Bokakhat police station, Soneswar Narah, Morongial gaon, Prabin Pegu, Balijan Adarsha Mishing Gaon, Golaghat district, Assam, Politics

Two villagers living near Assam's Kaziranga National Park (KNP) filed a police complaint seeking action against Sadhguru Jaggi Vasudeva of Isha Foundation and Assam CM Himanta Biswa Sarma for a drive inside the park on Saturday night.

కజిరంగా పార్కులో వన్యప్రాణుల చట్టానికి తూట్లు.. సీఎం, సద్గురుపై కేసులు

Posted: 09/26/2022 06:46 PM IST
Complaint against sadhguru assam cm for jeep safari in kaziranga national park

రాష్ట్రంలో చట్టాలను ప్రజలందరూ కచ్చితంగా పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అతనికి తోడు ప్రజలను నిత్యం సన్మార్గంలో నడిపించేలా ప్రవచనాలు చెబుతూ నడిపించే సద్గురువులతో పాటు రాష్ట్రంలోని మంత్రివర్గంలోని కొందరు అమాత్యులు కలసి చట్టాన్ని ఉల్లంఘించారు. వన్యప్రాణి పరిరక్షణా చట్టాన్ని ఉల్లంగిస్తూ.. యధేశ్చగా రాత్రి సమయంలో వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో వారు విహారించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలో, వీడియోలు బయటకు రావడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీంతో అదే రాష్ట్రానికి చెందిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు వారిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు.

అంతేకాదు వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దీంతో విపక్ష పార్టీలు వారిపై విమర్శలు సంధించాయి. అసలేం జరిగిందీ అంటే.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ‌, స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌తో పాటు ప‌ర్యాట‌క శాఖ మంత్రి జ‌యంత మ‌ల్ల బారువాలు వివాదంలో చిక్కుకున్నారు. వన్య‌ప్రాణి సంర‌క్ష‌ణా చ‌ట్టాల‌ను ఉల్లంఘించి.. ఆ ముగ్గురూ కజిరంగా జాతీయ పార్కులో నైట్ స‌ఫారీ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఇద్ద‌రు సామాజిక కార్య‌క‌ర్త‌లు ఆ ముగ్గురిపై పోలీసు ఫిర్యాదు న‌మోదు చేశారు. శ‌నివారం రోజున షెడ్యూల్ ముగిసిన త‌ర్వాత రైనోలు నివ‌సించే ప్ర‌దేశంలో ఆ ముగ్గురూ స‌ఫారీ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

1972, వైల్డ్‌లైఫ్ ప్రొట‌క్ష‌న్ యాక్ట్ ప్ర‌కారం.. నిర్దేశిత స‌మ‌యం ముగిసిన త‌ర్వాత జాతీయ పార్క్‌లోకి ఎంట‌ర్ కావ‌డం నిషేధం. అయితే స‌ద్గురు ఓ ఎస్‌యూవీను డ్రైవ్ చేస్తున్న వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఆ ఓపెన్ స‌ఫారీ వాహ‌నంలో హిమంత శ‌ర్మ‌, బారువా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ ఎక్క‌డా వైల్డ్‌లైఫ్ చ‌ట్ట ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని, వార్డెన్ అనుమ‌తి ప్ర‌కారం నిర్దేశిత ప్ర‌దేశంలో నైట్ స‌ఫారీ చేయ‌వ‌చ్చు అని సీఎం శ‌ర్మ తెలిపారు. ప్ర‌భుత్వ ఆహ్వానం మేర‌కు తాము పార్క్‌ను విజిట్ చేశామ‌ని స‌ద్గురు ఈషా ఫౌండేష‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles