E-bus week long trail run begins today తిరుమల కొండకు ఎలక్ట్రిక్ బస్సుతో ట్రయల్ రన్ ప్రారంభం..

E bus week long trail run begins today on tirumala tirupati ghat road

Olectra- EVEY buses trial run, E-buses trial run on ghat road, 100 e-buses on tirumala-tirupati, APSRTC letters of award, Tirumala-Tirupati ghat road, Trial Run of electric bus, week days trial run begins today, e-bus zero emission, Olectra, EVEY, 100 e-buses, APSRTC, letters of award, Tirumala-Tirupati ghat road, Trial Run, week days, zero emission, Vijayawada, Andhra Pradesh

The Olectra Greentech Limited (Olectra) and the Evey Trans Private Limited (EVEY), leaders in electric mobility and manufacturing of electric buses (e-buses), received a letter of award from the Andhra Padesh State Road Transport Corporation (APSRTC) for supply of 100 e-buses under the Government of India’s FAME-II scheme.

ITEMVIDEOS: తిరుమల కొండకు ఎలక్ట్రిక్ బస్సుతో ట్రయల్ రన్ ప్రారంభం..

Posted: 09/19/2022 06:34 PM IST
E bus week long trail run begins today on tirumala tirupati ghat road

తిరుమల కొండపైకి ఎలక్ట్రిక్ బస్సు ట్రయల్ రన్ ఇవాళ ప్రారంభమైంది. ఇవాళ ఆర్టీసీకి చెందిన ఉన్నతాధికారులతో ఎలక్ట్రికల్ బస్సు ట్రయల్ రన్ ప్రారంభమైంది. శ్రీవారి భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి సప్తగిరులపై కాలుష్య నివారణకు చేపడుతున్న చర్యలలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఇవాళ తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ విభాగం నిపుణులు ఈ బస్సులో ఎక్కి తిరుపతి నుంచి రెండో ఘాట్ రోడ్డు ద్వారా తిరుమల చేరుకున్నారు. ఎత్తయిన ప్రదేశాలు, మలుపుల వద్ద ఈ ఎలక్ట్రిక్ బస్సు పనితీరును పరిశీలించారు.

ఇవాళ నిర్వహించిన ట్రయల్ రన్ పై సంతృప్తిని వ్యక్తం చేసిన ఆర్టీసీ అధికారులు.. ట్రయల్ రన్ వారం రోజుల పాటు కొనసాగనుందని.. ఇవాళ ప్రారంభమైందని.. వారం రోజుల తరువాత ఈ గేర్ రహిత బస్సు పనితీరు, చార్జింగ్, తదితర అంశాలపై పరిశీలిస్తామని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏపీ ప్రభుత్వం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం 100 బస్సులను ఒలెక్ట్రా ఏపీఎస్ఆర్టీసీకి అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు బస్సులు అలిపిరి డిపోకు చేరుకున్నాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లనే ఈ విద్యుత్ ఆధారిత బస్సుల్లో డ్రైవర్లుగా నియమించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles