Indian student injured in Canada shooting dies కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి

Indian student succumbs to injuries sustained during shooting rampage in canada

Indian student in Canada dies, Indian student's death in Canada, Canada shooting rampage, Indian student killed Canada attack, Canada shooting, Indian student killed Canada shooting, police constable killed Canada shooting, Indian Student, Satwinder Singh, Conestoga College, Auto Mechanic, Part time job, MK Auto Repairs, Ontario province, Hamilton General Hospital, Canada, latest world news

A 28-year-old Indian student has succumbed to the injuries sustained during a shooting rampage in Canada’s Ontario province that also claimed two other lives, including that of a police constable, police said.

కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి

Posted: 09/19/2022 05:46 PM IST
Indian student succumbs to injuries sustained during shooting rampage in canada

అగ్రరాజ్యం అమెరికాలోని తుపాకీ సంస్కృతి పోరుగు దేశంలోని కెనడాలోకి కూడా వ్యాపించిందా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు అంటే హేయభావమని అమెరీకన్లు కాకుండా ఇతర దేశస్థులు ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోలు కూడా నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇది అటుంచితే.. తాజాగా కెనడాలో కూడా తుపాకీ సంస్కృతి రాజ్యమేలుతోంది. ఈ కాల్పుల ఘటనలో కోటి ఆశలతో కెనడాకు వెళ్లి అక్కడ పార్ట్ టైమ్ కారు మెకానిక్ వద్ద పని నేర్చుకుంటున్న విద్యార్థి అసువులు బాసాడు.

కెనడాలోని అంటారియో ప్రావిన్‌లో అకారణంగా భారతీయ విద్యార్థిపై ఆగంతకుడు కాల్పులు జరిపిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్  సహా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన గత సోమవారం మిల్టన్‌లో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి గాయపడ్డాడని హాల్టన్‌ ప్రాంతీయ పోలీస్‌ సర్వీసెస్‌ (హెచ్ఆర్పీఎస్) తెలిపింది. మృతుడిని సత్వీందర్‌ సింగ్‌గా గుర్తించారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. సత్వీందర్ సింగ్ ఎంకే ఆటో రిపేర్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డిన సత్విందర్ సింగ్.. గత రాత్రి బ్రెయిన్ డెడ్ కావడంతో మరణించాడని పేర్కోన్నారు. సత్విందర్ సింగ్ తో పాటు ఈ ఘటనలో టొరంటో పోలీస్ కానిస్టేబుల్ ఆండ్రూ హాగ్, ఎంకే ఆటో రిపేర్ యజమాని షకీల్ అష్రఫ్ మృతి సైతం ప్రాణాలు కోల్పోయారు. కాగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో సాయుధుడైన ఆగంతకుడు సీన్‌ పెట్రీ (40) మరణించాడు. భారతదేశంలో ఎంబీఏ మార్కెటింగ్ చేసిన సత్విందర్ సింగ్ ఉన్నత చదువుల కోసం కోన్స్ టోంగా కాలేజీలో చేరి.. తరగతులు ముగిసిన తరువాత సాయంకాల సమయంలో పార్ట్ టైమ్ గా ఆయన ఏంకే అటో రిమేర్స్ లో పని నేర్చుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles