HC restores complaint against former CM Yeddyurappa మాజీ ముఖ్యమంత్రి చుట్టూ బిగుసుకుంటున్నఅవినీతి కేసు ఉచ్చు..

Hc restores complaint against former cm yeddyurappa over alleged corruption case

BS Yeddyurappa, Karnataka former CM, Karnataka High Court, bribe, corruption case, Justice S Sunil Dutt Yadav, social activist TJ Abraham, Special Court, Petition, BY Vijayendra, Minister, ST Somashekar, Karnataka, Politics

Observing that there is no need for the previous sanction for the special court to order an investigation under Section 156(3) of the CrPC, the Karnataka High Court on Wednesday restored the private complaint against former chief minister BS Yeddyurappa for allegedly accepting bribe. The High Court has also directed the Special Court to proceed from the state of post-presentation of the private complaint, it added.

మాజీ ముఖ్యమంత్రి చుట్టూ బిగుసుకుంటున్నఅవినీతి కేసుల ఉచ్చు..

Posted: 09/14/2022 04:39 PM IST
Hc restores complaint against former cm yeddyurappa over alleged corruption case

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన ముఖ్యమంత్రి హయాంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై న్యాయస్థానం దర్యాప్తునకు ఆదేశించింది. యడ్డ్యూరప్ప అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బెంగళూరు కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఆయనతో పాటు  ఆయన కుటుంబసభ్యులు అనేక కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారంటూ దాఖలైన ప్రైవేటు పిటిషన్​ను విచారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.

అయితే ఈ దర్యాప్తును నిర్ణీత గడవులో పూర్తిచేసి.. తుది నివేదిక ఇచ్చేందుకు నవంబర్​ 2 వరకు గడువు ఇచ్చింది. అదే రోజున తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త 2021 జూన్​లో దాఖలు చేసిన పిటిషన్​ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దానిని విచారిస్తూ ఈ మేరకు అదేశాలను వెలువరించింది. సీఎంగా ఉన్న సమయంలో యడ్డ్యూరప్ప.. కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకుని బెంగళూరు డెవలప్​మెంట్ అథారిటీ(బీడీఏ) పరిధిలోని హౌసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టును రామలింగం కన్​స్ట్రక్షన్​ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు.

ఈ అవినీతి ముడుపుల విషయంలో యడ్యూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర, కుమార్తె పద్మావతి బంధువు శశిధర్​ను నిందితులుగా పేర్కొన్నారు. అయితే.. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తొలుత అబ్రహం పిటిషన్​ను కొట్టివేసింది. దీనిపై ఆయన హైకోర్టు ఆశ్రయించారు. టీజే అబ్రహం పిటిషన్​ను పునఃపరిశీలించాలని రాష్టోన్నత న్యాయస్థానం ఆదేశించగా.. స్పెషల్ కోర్టు మరోసారి విచారణ జరిపింది. యడ్యూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో పదవులు పోయి ఇబ్బందులు పడుతున్న ఆయన చుట్టూ తాజాగా కేసులు చుట్టుముడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles