Rules For Social Media Influencers Likely In Next 15 Days సోషల్ మీడియాకు కొత్త మార్గదర్శకాలు.. గీత దాటితే రూ.10 లక్షల జరిమానా..

Guidelines for social media influencers in 15 days fine up to rs 10 lakh for violating norms

social media guidelines, facebook guidelines, Instagram, Twitter, Guidelines for social media influencers, influencers' association with brand, endorsing products, Central Consumer Protection Authority (CCPA), Advertising Standards Council of India (ASCI), e-commerce websites, e-commerce, reviews

In a major development, the government is set to come up with guidelines on social media influencers, including celebrities, soon. The Central Consumer Protection authority (CCPA), under the Department of Consumer Affairs, has completed consultation with all stakeholders concerned on the matter, and guidelines are expected in the next 10 days.

సోషల్ మీడియాకు కొత్త మార్గదర్శకాలు.. గీత దాటితే రూ.10 లక్షల జరిమానా..

Posted: 09/08/2022 04:58 PM IST
Guidelines for social media influencers in 15 days fine up to rs 10 lakh for violating norms

సామాజిక మాధ్యమాల్లో ఏ అంశంపై వెతికినా.. అందులో ఆ అంశానికి సంబంధించి ఏదో ఒక సమాచారం లభ్యం అవుతుంది. ఇక ఇటీవల తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు నేర్పించినా వారికి అర్థం కాకపోతే ఇదివరకైతే ట్యూషన్లు పెట్టుకునేవారు.. కానీ ఇప్పుడు మాత్రం అదేంలేదు. వెంటనే సెల్ ఫోన్ తీసుకుని ఆందుకు సంబంధించిన సమాచారం వెతికి.. రాబట్టుకుని తద్వారా నేర్చుకుంటున్నారు. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద పేరున్న ప్రముఖుల వరకు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. ఈ మాద్యమం అంతటి ప్రభావాన్ని చాటుతుంది.

అయితే ఇవి చేతిలో ఉన్నాయి కదా అని కొందరు మాత్రం తమకు ఇష్టమైన సమాచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని దానినే అందరిచేత చదువించేలా చేస్తున్నారు. అంటే తమకు అనుకూలమైన విధంగా మార్చి ఇతరులను ప్రభావితం చేస్తున్నారు. ఇలా కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఏ వస్తువుపైనైనా ఉన్నది ఉన్నట్లుగా కాకుండా తమకు అనుకూలంగా నిర్ణయం చెప్పేవారికి ఇకపై చాలా కష్టం కానుంది. అలాగని ఉన్నది ఉన్నట్లు చెబుతాం అంటూ ఏదో ఒక బ్రాండు గురించి విషదీకరిస్తూ వివరణాత్మక వీడియోలు, రివ్యూలు, ఒపినియన్ లు చెప్పినా.. దాని వెనుకనున్న అసలు విషయం కూడా చెప్పాలి.

అదేంటి అంటే.. చక్కని ఫాలోయింగ్ ఉన్న ఇన్ ఫ్ల్యూయన్సర్లు, లక్షల్లో సబ్ స్ర్కైబర్స్ ఉన్నవారు, లేక సెలబ్రిటీలు ఏదైనా ఒక బ్రాండ్ కు మద్దతు పలికితే.. అందుకుగాను వారికి బ్రాండ్ నుంచి పారితోషకం లభిస్తే.. ఆ విషయాన్ని కూడా ఇక అధికారికంగా పొందుపర్చాల్సి ఉంటుంది. దీంతో పాటు బ్రాండ్ తో తాము అసోసియేట్ అయ్యామన్న విషయాన్ని కూడా చెప్పాల్సిందే. ఇక ఎవరైనా ఒక ప్రాడక్ట్ గురించి తమ ఒపినియన్ చెప్పాలంటే మాత్రం వారు ఆఉత్పత్తని కొనుగోలు చేసినవారై ఉండాలని తాజా మార్గదర్శకాలు సూచించనున్నట్లు సమాచారం.

ఇలా పలు కీలక మార్గదర్శకాలతో సోషల్ మీడియా గైడ్ లైన్స్ మరో రెండు వారాల్లో రాబోతున్నాయి. ఏదైనా బ్రాండ్‌కు ప్రచారం చేసే, ప్రభావితం చేసే వ్యక్తులు (ఇన్‌ఫ్లుయెన్సర్లు) స్పష్టమైన, వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాల్సి ఉంది. అలాగే ఈ-కామర్స్ సైట్లలో ఆయా వస్తువులపై రివ్యూలు రాసేవారు కూడా ఇకపై వాస్తవ దృక్పథంతోనే రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా చెల్లించుకోక తప్పదు. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే మాత్రం రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. సెలబ్రిటీ ఎవరైనా సరే ఈ జరిమానా కట్టి తీరాల్సిందే.

ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ పక్షం రోజుల్లో ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ) పేరిట విడుదల చేయనుంది. తప్పు దోవ పట్టించే ప్రకటనల నుంచి ప్రజలను రక్షించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బ్రాండ్‌ను ఎండార్స్ చేసేవారు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు, బ్లాగర్లను దీనికిందకు తీసుకురానుంది. అంతేకాదు, వస్తువులను ఉచితంగా తీసుకుని వాటిని ప్రచారం చేసేవారు, పొందిన వస్తువులకు ముందుగా 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకున్న వస్తువులను మళ్లీ తిరిగి వారికి అప్పగిస్తే కనుక సెక్షన్ 194 కింద ఆ మొత్తాన్ని తిరిగి పొందొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles