Traffic restrictions, diversions announced for Ganesh immersion గణ్ణేశ్ నిమజ్జనం: నగరంలోని ఈ రోడ్లు, ఫ్లైఓవర్లు బంద్..

Hyderabad s khairatabad ganesh will be immersed in hussain sagar organisers

Ganesh Immersion, Ganesh Procession route map, Ganeshotsav, Hyderabad Ganesh Immersion parking, Traffic diversions, RTC busses notallowed in procession route, PVR Expressway, outer ring road, Bhagyanagar Ganesh Ustav committee, Masab Tank, Begumpet fly over, paradise flyover, Hyderabad Traffic Restrictions, Hyderabad, cyberabad, Rachakonda commissionerate, RGIA airport, Traffic Police, Telangana, Crime

The grand immersion of Ganesh idols will be taking place on Friday in Hyderabad. The city traffic police placed traffic restrictions and diversions across the Hyderabad, Cyberabad and Rachakonda areas on September 9. The Hyderabad City Police Commissioner C.V. Anand requested the public to take note of the arrangements and follow the directions to relieve congestion on roads and maintain a smooth flow of traffic and public safety on Ganesh Nimmajjanam.

గణేశ్ నిమజ్జనం.. హైదరాబాద్లో సెలవు: ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రోడ్లు, ఫ్లైఓవర్లు బంద్..

Posted: 09/08/2022 01:18 PM IST
Hyderabad s khairatabad ganesh will be immersed in hussain sagar organisers

వినాయక నవరాత్రులు ఇవాళ్టితో ముగియడంతో రేపు గణేశుడి లడ్డూల వేలం అనంతరం నిమజ్జనానికి హైదరాబాద్ నలుమూలల నుంచి గణనాధులు బయలుదేరి హుస్సేస్ సాగర్ కు చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం నుంచి గణనాదులు గంగమ్మ ఒడికి చేరుకునే సామూహిక నిమజ్జన ప్రక్రియ ప్రారంభంకానుంది. అయితే నిమజ్జనానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ట్రాఫిక్ ను దారి మళ్లించడంతో పాటు పలు రహదారులు, ఫ్లైఓవర్లపై నుంచి వాహనాల రాకపోకలను నిషేధించింది. మరీముఖ్యంగా వినాయకుల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో కొనసాగనున్నాయి. ఇవి మరుసటి శనివారం ఉదయం వరకు అమల్లోఉంటాయి.

ఇక గణనాధుల ఊరేగింపు, నిమజ్జనం ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ఎలాంటి వాహనాలకు అనుమతించమని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే వినాయక నిమజ్జనానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఉండటంతో అందుకు తగినట్లుగానే ఘనంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ లో జరిగే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి చూడటానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వినాయక నిమజ్జనం విషయంలో భాగ్యనగర్ ఉత్సవకమిటీకి ప్రభుత్వానికి మధ్య కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతుండగా ప్రభుత్వం దానికి ముగింపు పలికింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి ఇవ్వమని చెప్పడంతో ఈ వివాదం రాజుకుంది.

అయితే వెనక్కి తగ్గిన ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేయడంతో ఈ సమస్యకు చెక్ పడింది. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రైవేటు వ్యాపార సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిమజ్జనం సందర్భంగా అనేక రహదారులపై వాహనాల రాకపోకలకు ఆంక్షలు ఉండటం కారణంగా సెలవును ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9న హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా సెలవు ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీచేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాల్లో సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles