ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఒక్కోసారి అది చాలా ఆలస్యంగా వస్తుంది. అందుకు కారణాలు అనేకం కావచ్చు. డెలివరీ బాయ్ వాహనం పంక్చర్ కావచ్చు.. లేదా అతని బైక్ లో పెట్రోల్ అయిపోయి ఉండవచ్చు.. లేదా అతనికి ఏదైనా ప్రమాదం సంభవించి కూడా ఉండవచ్చు. అయితే మనం మాత్రం నిర్ణీత సమయం దాటినా ఆర్డర్ అందకపోతే.. వెంటనే ఆ యాప్ కస్టమర్ సర్వీస్ తో చాట్ చేసి.. ఫుడ్ డెలివరీ ఎందుకు ఆలస్యం అవుతుందని అడుగుతాం. ఇక వారు ఏదో కారణం చెప్పడం.. మనం అసంతృప్తికి గురికాడం.. అందుకుగాను వారు ఏదో ఒక తాయిలం ఇస్తామని చెప్పడం జరుగుతోంది.
ఆకలి మంట వేధిస్తుంటే.. ఏదైనా హోటల్ కు వెళ్లి ఆర్డర్ ఇస్తే దానిని.. తీసుకురావడానికి బేరర్ కాసింత ఎక్కువ టైం తీసుకున్నా.. ఆ ఆకలి మనకు విచక్షణను కోల్పోయేలా చేస్తోంది. అప్పటివరకు చుట్టూ ఉన్నవారిని పట్టించుకునే మనం.. ఆకలి మంటకు తట్టుకోలేక.. ఆర్డర్ ఏమైందంటూ బేరర్ పై కేకలు వేసేస్తాము. అది క్షుద్భాద. దాని గురించి అందరికీ తెలిసినా.. ఆవేశంలో కొన్నిసార్లు పట్టించుకోం. ఇక డెలివరీ యాప్ లు రావడంతో భోజన ప్రియులకు మరింత సౌకర్యం లభించినట్లు అయ్యింది. వీటి ద్వారా మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
అయితే ప్రతీసారి ఆర్డర్ చేసిన ఫుడ్ బాగానే ఉన్నా కొన్నిసార్లు మాత్రం బాగుండదు. రుచిలో తేడా ఉంటుంది. ఇలాంటివి అప్పుడప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. ఇక కొన్ని సార్లు ఫుడ్ పడిపోవడం, తెచ్చిన ప్యాకింగ్ కవర్ లోకి కారిపోవడం వంటివీ జరుగుతుంటాయి. కానీ ఓ వ్యక్తికి మాత్రం అస్సలు ఏమాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన ఫుడ్ ఆర్డర్ ప్యాక్ ను ఓపెన్ చేసి చూసి ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. దీనికి సంబంధించి డామియెన్ సాండర్స్ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. డామియెన్ ఇటీవల ఓ రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్ చికెన్, ఓ కూల్ డ్రింక్ ను ఆర్డర్ చేశాడు.
డెలివరీ బాయ్ కాస్త లేటుగా ఫుడ్ ను తెచ్చి ఇచ్చాడు. ప్యాకెట్ ను లోపలికి తీసుకెళ్లిన డామియెన్.. చికెన్ తిందామని ఆబగా ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు. అందులో ఫ్రైడ్ చికెన్ కు బదులుగా.. మొత్తం చికెన్ తినేసి, మిగిలిన ఎముకలు మాత్రమే ఉన్నాయి. దానితోపాటు ఓ లెటర్ కూడా రాసి పెట్టి ఉంది. ‘‘నన్ను క్షమించండి. ఈ ఫుడ్ నేను తినేశాను. నాకు బాగా ఆకలిగా ఉంది. నా కోసం మీరు పే చేశారని అనుకోండి. ఈ దరిద్రపు గొట్టు జాబ్ ను నేను వదిలేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలి.. ఇట్లు మీ డెలివరీ బాయ్” అని ఆ లెటర్ పై ఉంది. డామియెన్ దీనంతటినీ వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది.
కొందరమో దీనిపై జోకులు వేస్తుంటే.. మరికొందరు డెలివరీ బాయ్ తీరును తిట్టిపోస్తున్నారు. మరికొందరేమో ‘ఆకలేసి తినేసి ఉంటాడులే.. అతడిని క్షమించండి’ అని అంటుంటే.. ‘ఎంత ఆకలేసి తింటే మాత్రం.. తినేసిన ఎముకలను ప్యాకేజీలో పెట్టి ఇస్తాడా?’ అని ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక డెలివరీ బాయ్ చికెన్ తినేసినా.. డ్రింక్ ను మాత్రం అలాగే తెచ్చి ఇచ్చాడు. దీనిపైనా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఇంకా నయం ఆ డ్రింక్ అయినా తెచ్చాడు. అదీ తాగేసి, ఖాళీ బాటిల్ పెట్టలేదు..’ అని పేర్కొంటున్నారు. అయితే ఇక్కడా తన ఆకలి బాధతో ఆర్డర్ చేయడంతోనే డానియెన్ ఇలా ఇస్టాలో పోస్టు పెట్టాడు. లేదంటే సహృదయంతో డెలివరీ బాయ్ ఆకలిని అర్థం చేసుకునేవాడే.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more