LPG Commercial Cylinder Price Cut Today by Rs 91.50 గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

Commercial lpg price slashed by rs 91 50 check new cost of 19 kg cylinder in your city

LPG Cylinder Price, Commercial LPG Cylinder Price, Commercial LPG Cylinder Price slashed, Domestic LPG Cylinder Price, LPG Cylinder Price in Hyderabad, Cylinder Price in Hyderabad, LPG Cylinder, petroleum products

The price of 19-kg commercial LPG (liquefied petroleum gas) cylinder has been reduced by Rs 91.50. The new price comes into effect from 1 September. Now, a cylinder of commercial LPG in Delhi is retailed at Rs 1,885 down from Rs 1,976. The revision of price will benefit hotels, restaurants and other business establishments that purchase 19-kg commercial LPG cylinders.

గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతో తెలుసా.?

Posted: 09/01/2022 01:46 PM IST
Commercial lpg price slashed by rs 91 50 check new cost of 19 kg cylinder in your city

కరోనా తరువాత రోజుల నుంచి అత్యధిక ధరలతో అల్లాడిపోతున్న జనంపై ఇటు కేంద్ర పెట్రోలియం శాఖ కూడా కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా కొంత ఉపశమనం కల్పించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.91.5 మేర తగ్గించినట్లు ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. ఇది నిజంగా వాణిజ్య సిలిండర్‌ వినియోగించే వారికి గొప్ప ఊరట కలిగించే విషయమే. ఈ కొత్త ధరలు గురువారం (సెప్టెంబర్‌ 1) నుంచి అమల్లోకి రానున్నాయి.

ధర తగ్గిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో గతంలో రూ.1976గా ఉన్న 19 కేజీల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ఇప్పుడు రూ.1885కే రానుంది. ఇక హైదరాబాద్‌లో ఈ సిలిండర్‌ ధర రూ.2099కి తగ్గింది. వరంగల్‌లో రూ.2141గా, విజయవాడలో రూ.2034గా, విశాఖపట్నంలో రూ.1953గా ఉంది. వాణిజ్య సిలిండర్‌ ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ సిలిండర్‌ ధరను తగ్గించడం ఇది వరుసగా ఐదోసారి కావడం విశేషం. అయితే కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. ఉపశమనం కేవలం ఆయా వినియోగదారులకు మాత్రమే పరిమితం చేసింది.

డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను మాత్రం అలాగే ఉంచాయి. నెల రోజులుగా డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులు లేవు. ఆగస్ట్‌ 1న హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్‌ రూ.1105గా ఉండగా.. ఇప్పుడూ అంతే ఉంది. చివరిసారి జులై 6వ తేదీని ఈ సిలిండర్‌ రూ.50 పెంచారు. ఆ తర్వాత ఇందులో హెచ్చుతగ్గులేమీ లేకుండా స్థిరంగా ఉంటోంది. నిజానికి ప్రతి నెలలో ఈ సిలిండర్ల ధరలను రెండుసార్లు సవరించే అవకాశం ఆయిల్‌ కంపెనీలకు ఉంటుంది. ప్రతి 15 రోజులకోసారి సిలిండర్‌ ధర పెంచడం లేదా తగ్గించడం చేస్తాయి. అయితే డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను చాలా రోజులగా సవరించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles