Local BJP leader Seema Patra arrested for torturing maid బీజేపి మహిళా నేత సీమ పాత్ర అమానవీయ చర్యలు..

Jharkhand suspended bjp leader seema patra arrested for abusing house help

beti bachao, beti padhao, Seema patra, Retd IAS officer Maheshwar Patras wife, BJP leader beat maid, BJP's women's wing, national working committee, Retd IAS officer Maheshwar Patra, Retd IAS officers wife, BJP leader, domestic help, sunita, deepak prakash, patras, maharashtra, ranchi, Seema Patra, BJP, Jharkhand, Crime

The National Commission for Women took cognizance of media reports of suspended Jharkhand BJP leader Seema Patra brutally assaulting and harassing her domestic help. Patra is member of the BJP's women's wing's national working committee. Maheshwar Patra, her husband, is retired Indian Administrative Service (IAS) officer.

బీజేపి మహిళా నేత సీమ పాత్ర అమానవీయ చర్యలు.. పనిమనిషిపై దారుణం..

Posted: 09/01/2022 12:52 PM IST
Jharkhand suspended bjp leader seema patra arrested for abusing house help

జార్ఖండ్‌లోని ఒక బీజేపీ నాయ‌కురాలు అత్యంత దారుణంగా, అమానవీయంగా వ్యవహరించింది. అమె చేసే ఘోరాలు చూసి భరించలేని అమె కొడుకే.. ఇవి. గిరిజ‌న ప‌నిమ‌నిషిని పెట్టిన చిత్ర‌హింస‌లు ఇవి. ఆ నాయ‌కురాలి కొడుకు సాయంతో ఆ న‌ర‌కం నుంచి బ‌య‌టప‌డింది ఆ మహిళ‌. ఆ నాయ‌కురాలిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది బీజేపీ. ప్ర‌స్తుతం ఆమె జైలు ఊచ‌లు లెక్కపెడుతోంది. ప‌నిమ‌నిషిని దారుణంగా హింసించిన బీజేపీ మాజీ నేత సీమా పాత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం స‌హా ప‌లు సంబంధిత చ‌ట్టాల్లోని సెక్ష‌న్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. కోర్టు ఆమెను 14 రోజుల జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపించింది.

సీమా పాత్ర. జార్ఖండ్‌లో బీజేపీ లీడ‌ర్‌. పార్టీ మ‌హిళా విభాగం జాతీయ వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యురాలు. భ‌ర్త మ‌హేశ్వ‌ర్ పాత్రా మాజీ ఐఏఎస్ అధికారి. వారి ఇంట్లో గిరిజ‌న మ‌హిళ సునీత‌(29) ప‌దేళ్లుగా ప‌ని చేస్తోంది. ఆ పనిమ‌నిషిపై సీమా పాత్రా చేయ‌ని ఘోరం లేదు. చిన్న చిన్న కార‌ణాలు చూపి ఆమెను దారుణంగా హింసించేది. ఐర‌న్ పాన్‌తో నోటిపై కొడితే ప‌ళ్లు రాలాయి. టాయ‌లెట్‌ను నాలిక‌తో క్లీన్ చేయించింది. ఫ్లోర్‌పై ప‌డిన యూరిన్‌ను నాకించింది. ఆ ప‌నిమ‌నిషి దేహమంతా గాయాలే. ఒళ్లంతా వాత‌లే. కార‌ణం లేకుండానే వేడివేడి గ‌రిట‌తో వాత పెట్టేది. రోజుల త‌ర‌బ‌డి అన్నం పెట్టేది కాదు. క‌నీసం తాగ‌డానికి మంచినీరు కూడా ఇచ్చేది కాదు. గ‌త ప‌దేళ్లుగా ఈ చిత్ర‌హింస‌ల‌ను సునీత భ‌రిస్తోంది.

ఆ నాయ‌కురాలి కుమారుడు ఆయుష్మాన్ పాత్రా ఈ దారుణాల్ని చూడ‌లేక‌పోయేవాడు. సాధ్య‌మైనంత‌గా ఆ ప‌నిమ‌నిషికి సాయం అందించేవాడు. ఎంత వారించినా త‌ల్లి విన‌క‌పోవ‌డంతో.. ఈ దారుణాల‌ను త‌న స్నేహితుడు వివేక్ ఆనంద్ బ‌స్కీకి వివ‌రించాడు. త‌న త‌ల్లి ప‌నిమ‌నిషిని చిత్ర‌హింస‌లు పెడుతున్న కొన్ని వీడియోల‌ను షేర్ చేశారు. ప్ర‌భుత్వ ఉన్న‌తోద్యోగి అయిన ఆ స్నేహితుడు వెంట‌నే ఆ వీడియోల‌తో పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. వారు సీమా పాత్రా ఇంటిపై దాడి చేసి ప‌నిమ‌నిషి సునీత‌ను కాపాడి, ఆసుప‌త్రిలో చేర్పించారు.

ఈ స‌మాచారం ముందే అందుకున్న సీమా పాత్ర త‌ప్పించుకుని పోతుండ‌గా, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దుర్మార్గాల్లో సీమా పాత్రా భ‌ర్త పాత్ర లేద‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌, సంబంధిత వీడియోలు వైర‌ల్ అయ్యాయి. రాజ‌కీయంగా పెను దుమారం లేచింది. స్వ‌యంగా గ‌వ‌ర్న‌ర్ ర‌మేశ్ బియాస్ రాష్ట్ర డీజీపీని పిలిపించుకుని దీనిపై ఆరా తీశారు. అయితే, బీజేపీ లీడ‌ర్‌ను కాబ‌ట్టి, త‌న‌పై ఈ కుట్ర ప‌న్నార‌ని, తాను అమాయ‌కురాలిన‌ని సీమా పాత్ర తెలిపారు. ఈ దారుణాలు వెలుగులోకి రావ‌డంతో సీమా పాత్రాను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు బీజేపీ ప్ర‌క‌టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles