Air India International Flights to resume from Vijayawada విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానాలు.. గన్నవరం నుంచి షార్జాకు..

Air india express international flights between vijayawada and sharjah soon

Air India Express International Flights, Vijayawada and Sharjah Flights Soon, vijayawada Gannavaram airport, october 31, vande Bharat, Sharjah Ticket Prices, Air India Express, International Flights, Vijayawada and Sharjah, Ticket Prices, Air India Express flights, Gannavaram airport, Sharjah, Andhra Prades

International flight services will commence from Vijayawada’s Gannavaram airport soon, which were earlier stalled since the COVID pandemic. It may be recollected that the Vande Bharat Mission flights were being operated as a part of the mission to bring back Indians to the country. With the lifting of the ban on international flight services by the Central Government, Airport authorities have started full-fledged services to other countries.

విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానాలు.. గన్నవరం నుంచి షార్జాకు..

Posted: 08/29/2022 08:08 PM IST
Air india express international flights between vijayawada and sharjah soon

విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దన క్రమంలో ఇక త్వరలోనే ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్‌ 31 వ తేదీ నుంచి అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానయాన సంస్థ విజయవాడ నుంచి షార్జాకు అంతర్జాతీయ విమాన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వారానికి రెండు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముందుకు వచ్చింది. షెడ్యూల్ ప్రకటించడమే కాదు టికెట్ బుకింగ్స్‌ కూడా మొదలుపెట్టారు.

దీంతో దాదాపు మూడున్నరేళ్ల తరువాత విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇక్కడి నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. విజయవాడ-షార్జా మధ్య ఎక్స్‌ప్రెస్‌ విమాన సేవలు ప్రతి సోమవారం, శనివారం ఉంటాయి. 186 మంది ప్రయాణీకుల బోయింగ్ 737-800 విమానం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.40 గంటలకు షార్జా నుంచి బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇక్కడ సాయంత్రం 6.35 గంటలకు బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుతుంది.

విజయవాడ నుంచి షార్జాకు ప్రారంభ టిక్కెట్ ధర రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీసు ప్రారంభమైతే అరబ్ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇటీవల విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయడంతో ఇక్కడి నుంచి విదేశాలకు పూర్తి స్థాయిలో సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. యూఏఈలోని షార్జాతో పాటు దుబాయ్, అబుదాబి, అజ్మాన్, పుజిరా, రస్ అల్ ఖైమా నుంచి ఇక్కడికి ప్రయాణించడం సులభతరం అవనున్నది.

అలాగే, గల్ఫ్‌లోని అనేక దేశాలకు వెళ్లడానికి షార్జా నుంచి సులభమైన కనెక్టివిటీ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. భవిష్యత్‌లో ప్రయాణీకుల డిమాండ్‌కు తగినట్లుగా దుబాయ్, కువైట్ నుంచి పూర్తి స్థాయి విమాన సర్వీసులను నడపడానికి వివిధ విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. విజయవాడ విమానాశ్రయానికి 2017 మే నెలలో అంతర్జాతీయ హోదాను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, పలు సాంకేతిక కారణాలతో 2019 లో విజయవాడ-సింగపూర్‌ మధ్య వారానికి ఒక సర్వీసు నడిచే సర్వీసును 6 నెలలపాటు రద్దు చేశారు. ప్రస్తుతం మస్కట్‌కు వారానికి ఒక సర్వీసు, అలాగే షార్జా, కువైట్‌, మస్కట్‌ నుంచి వారానికి ఐదు సర్వీసులు మాత్రమే ఇక్కడి నుంచి నడుస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles