Locals Finds Unique Ways to Protest Bad Roads రోడ్ల దుస్థితిపై స్థానికుల వినూత్న నిరసనలు

Locals finds unique ways to protest bad roads as woes continue

pothole protests, mumbai potholes, bangalore pothole, bengaluru pothole protests, mumbai pothole protests, protest against pothole, mumbai ganesh chathurthi pothole, bmc pothole, pothole demonstration, yamaraj pothole, pothole yamaraj, yamaraj pothole protest, Mumbai. BJP govt, Politics

A man in Thane was killed while trying to navigate potholes on the road. In another incident in Nagpur, home constituency of Maharashtra CM Eknath Shinde, people held an agitation against bad conditions of roads. The ubiquitous problem of bad roads, especially in the monsoon season, continues to force residents to protest against potholes.

బీజేపి పాలిత రాష్ట్రాల్లోని రోడ్ల దుస్థితిపై స్థానికుల వినూత్న నిరసనలు

Posted: 08/29/2022 06:52 PM IST
Locals finds unique ways to protest bad roads as woes continue

బీజేపీపాలిత రాష్ట్రాల్లోని రోడ్డ‌న్నీ గుంత‌ల‌మ‌య‌ంగా మారాయని పేర్కోంటూ ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ గోతులమయంగా మారిన రోడ్డపై ప్రయాణిస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2018 – 2020 మధ్య కాలంలో గుంతల కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల వ‌ల్ల‌ 5,626 మంది మరణించారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2018, 2019, 2020లో గుంతల కారణంగా మొత్తం రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య వరుసగా 2,015, 2,140 , 1,471గా ఉంది.

రోడ్ల దుర్భర పరిస్థితులపై ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వినూత్న‌రీతిలో నిర‌స‌న తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో ఓ వ్య‌క్తి య‌మ‌ధ‌ర్మ‌రాజు వేషం వేసుకొని, రోడ్డుపై నిర‌స‌న తెలిపారు. కొద్దిరోజుల క్రితం బెంగళూరు వ్య‌క్తి కూడా ఇదే వేష‌ధార‌ణ‌లో త‌న నిర‌స‌న‌గ‌ళం వినిపించాడు. ఈ రోడ్ల‌న్నీ నిజంగా న‌ర‌కాన్ని త‌ల‌పిస్తున్నాయ‌ని, అందుకే య‌మ‌ధ‌ర్మ‌రాజు వేషం వేసుకొని నిర‌స‌న తెలుపుతున్న‌ట్లు వారు తెలిపారు. నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ముగ్గురు మహిళలు మత్స్యకన్యల్లాగా దుస్తులు ధ‌రించి, రోడ్డుపై గుంత‌ల వ‌ద్ద ఫొటోషూట్ నిర్వ‌హించారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మహిళలు మాక్ అవుట్‌డోర్ ఫ్యాషన్ షో నిర్వహించారు. రోడ్డుపై గుంత‌ల వ‌ద్ద వారు ర్యాంప్ వాక్‌చేశారు. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో అనుప్పూర్‌ను బిజూరి మనేంద్రగఢ్‌తో కలిపే రహదారిపై ఏర్ప‌డిన గుంత‌ల్లో నీరు నిలిచిపోయాయి. కొంత‌మంది స్థానికులు ఆ గుంత‌చుట్టూ కుర్చీలు వేసుకుని పార్టీ చేసుకుంటూ వినూత్నంగా నిర‌స‌న తెలిపారు. సురక్షితమైన రోడ్లు కావాలని కోరుతూ మంగళూరులో లిఖిత్‌రాయ్ అనే యువకుడు ఆగస్ట్ 12న నగర కార్పొరేషన్ భవనం వెలుపల నిరసన తెలిపాడు. అతని నిరసన వెనుక బాధాక‌ర‌మైన క‌థ ఉంది.

కొంచండి నివాసి అయిన లిఖిత్ రాయ్ స్నేహితుడు అతీష్ ఆగస్టు మొదటి వారంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కండెట్టు సమీపంలోని హైవేపై ఉన్న గుంతను అతీష్ గమనించలేదని, చివరి నిమిషంలో గుంతను తప్పించే ప్రయత్నంలో డివైడర్‌ను ఢీకొట్టాడని లిఖిత్ తెలిపాడు. మిత్రుడిని కోల్పోయిన బాధను మౌన నిరసన ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నట్లు రాయ్ తెలిపారు. బెంగళూరులోని అంజన్‌పుర నివాసితులు 2021 సెప్టెంబర్‌లో నీటితో నిండిన గుంతల్లో వరి నాటు వేశారు. రోడ్ల‌పై ఏర్ప‌డ్డ గుంత‌ల‌పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేద‌ని, అందుకే ఈ ప‌నిచేసిన‌ట్టు వారు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles