Man killed by lions after scaling zoo fence సింహాల ఎన్ క్లోజర్ లోకి దూకిన వ్యక్తి.. రెప్పపాటులో మృతి..

Lion kills ghana man who entered its enclosure in accra zoo

Lion eats man, Lion attack Man at Ghana zoo, Ghana Forestry commission, motive of lion enclosure intruder, Man, Lions enclosure, Accra zoo, Forest Guards, Forestry commission, Intruder, Ghana, South Africa, Crime

The Forestry Commission has confirmed that a man who reportedly jumped into the lion enclosure at the Accra Zoo Sunday afternoon and was attacked by a lion has been pronounced dead. He died from injuries sustained and the body has been conveyed to the morgue. The motive of the intruder is yet to be determined. His lifeless body was discovered by guards at the zoo.

సింహాల ఎన్ క్లోజర్ లోకి దూకిన వ్యక్తి.. రెప్పపాటులో మృతి..

Posted: 08/29/2022 02:58 PM IST
Lion kills ghana man who entered its enclosure in accra zoo

జూ పార్కులో క్రూర మృగాల చెంతకు వెళ్లరాదని జూ అధికారులు సందర్భకులను హెచ్చరిస్తూనే ఉంటారు. వీరితో పాటు జంతువుల డెన్ల వద్ద గార్డ్స్ కూడా సందర్శకులను అప్రమత్తం చేస్తూనే ఉంటారు. అయినా వారి కంట కూడా పడకుండా అనేక మంది వాటిని దగ్గరగా చూడాలన్న తలంపుతో వారి హెచ్చరికలను తోసిరాజుతూనే ఉంటారు. అయితే ఇలాంటి ఘటన ల్లో అనుకోకుండా వాటి డెన్ లలోకి జారిపడిన సందర్శకులు వాటికి ఆహారంగా మారిన ఘటనలు ఉన్నాయి. అదీ కాకుండా వాటి దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన ఘటనలు నమోదయ్యాయి.

ఇక తాజాగా మరోకటి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జూప్కార్ లోని క్రూర మృగాలను ఎన్ క్లోజర్ చేరువకు వెళ్లిన ఓ వ్యక్తి రెప్పపాటులో దాడికి గురయ్యాడు. జూ పార్కులో సింభం ఎన్ క్లోజర్ లో మృగరాజు సేద తీరుతోంది. ఇంతలో ఓ వ్యక్తి దానిని ఎన్ క్లోజర్ చేరువకు చేరుకున్నాడు. అంతే అప్పటివరకు హాయిగా సేద తీరుతున్నట్లు కనిపించిన ఆ మృగరాజు  రెప్పపాటులో అతనిపై దాడి చేసింది. సింహం దాడితో తీవ్రంగా గాయపడిన సందర్శకుడు.. అసుపత్రికి తరలించే లోపు మరణించాడు. ఈ ఘటన ఘనాలోని రాజధాని అక్రాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఘనా రాజధాని అక్రాలోని జూలో ఉన్న ఓ ఎన్‌క్లోజర్‌లో సింహాలు ఉన్నాయి. అయితే వాటి ఎన్ క్లోజర్లకు కొంత దూరంగానే ఉండి వాటిని వీక్షించే సందర్శకులు చూస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వాటిని మరింత సమీపం నుంచి చూడాలని తలచి భద్రతా కంచెపై నుంచి ఆ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. దీంతో ఆ ఎన్ కోజర్లలలో ఉన్న ఓ సింహం అతనిపై దాడిచేసింది. వ్యక్తి ఎన్ క్లోజర్ ఎక్కేంత వరకు హాయిగా సేద తీరుతున్నట్లు కనిపించిన మృగరాజు అతను దూకిదూకగానే అతడిపై దాడి చేసింది. అంతే సింహం దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని అసుపత్రికి తరలించేలోపు మరణించాడని ఫారెస్ట్రీ కమిషన్‌ తెలిపారు.

అయితే క్రూరమృగాలు ఉండే ఎన్ క్లోజర్లు నిషేధిత ప్రదేశాలని.. వాటిని దాటే ప్రయత్నం ప్రాణంతకమని హెచ్చరిస్తూ పెద్ద బోర్డులు వున్నా.. పట్టించుకోకుండా తమకేమీ కాదని నిర్లక్ష్యంతో వ్యక్తి హెచ్చరికలను అతిక్రమించాడని అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా, ఎన్‌క్లోజర్‌లోకి సదరు మృతుడు ఎలా ప్రవేశించాడనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. జూలోని సింహం, రెండు పిల్లలు సురక్షితంగా ఉన్నాయని పోలీసులు చెప్పారు. 1960లో అక్రా జూపార్కును ఘనా మొదటి అధ్యక్షుడు వామీ క్రుమాహ్‌ ప్రారంభించారు. మొదటి ఇది ప్రైవేటు యాజమాన్యంలో ఉండే. అయితే 1966లో మొదటిసారిగా ప్రజలను జూలోకి అనుమతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Man  Lions enclosure  Accra zoo  Forest Guards  Forestry commission  Intruder  Ghana  South Africa  Crime  

Other Articles