ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవ పడటం మనం సాధారణంగా చూస్తూవుంటాం. అప్పుడప్పుడు ఈ గోడవలు తీవ్రరూపం కూడా దాల్చి ఒకరిపై మరోకరు దాడులకు కూడా పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు కూడా వింటూనేవున్నాం. అయితే ఒక బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం తరచుగా సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో చూస్తుంటాం. ఇటీవల ఓ అబ్బాయి కోసం ఓ పాఠశాలకు చెందిన ఇదురు అమ్మాయిలు పోట్లాడగా, వారి స్నేహితులు కూడా ఘర్షణకు దిగిన ఘటనను కర్ణాటకలో చోటుచేసుకుంది.
ఇక తాజాగా ఇలాంటిదే మరో ఘటన మహారాష్ట్రలోనూ చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పైటాన్ జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కోసం పోట్లాడుకున్నారు. అయితే ఈ అమ్మాయిలు ఇద్దరూ మైనర్లే కావడం గమనార్హం. సినిమాలు, సీరియళ్లు, దీనికి తోడు ఓటిటీ యాప్స్ లోని వెబ్ సిరీస్ లు ఇవన్నీ అభంశుభం ఎరుగని అమాయక హృదయాలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో.. ఈ ఘటనలను బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక తెలిసీతెలియని వయస్సులో తమ గురించి ఎదుటివారు ఎలా అర్థం చేసుకుంటారన్న విషయాన్ని కూడా మర్చిపోయిన ఆ అమ్మాయిలు.. జనం గురించి కూడా పట్టించుకోకుండా జనసమ్మర్ధంతో నిండిన బస్టాండ్ తగువులాడటం విస్మాయానికి గురిచేసింది.
సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ అమ్మాయి బస్టాండ్‌కు వచ్చింది. ఈ విషయం తెలిసిన మరో అమ్మాయి అతడి కోసం బస్టాండ్‌కు చేరుకుంది. బస్టాండ్‌లో అమ్మాయిల మధ్య వాగ్వాదం ముదిరి వివాదానికి దారి తీసింది. ఇద్దరూ ఘర్షణ పడుతుండగా ఇదే ఛాన్స్ అంటూ బాయ్‌ఫ్రెండ్ అక్కడి నుంచి జారుకున్నాడు. బస్టాండ్‌లో న్యూసెన్స్ చేస్తుండటంతో అమ్మాయిలిద్దరినీ అధికారులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాయ్‌ఫ్రెండ్ కంటే లైఫ్‌లో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఆపై విడుదల చేశారు. అమ్మాయిలు ఇద్దరికీ దాదాపు 17 ఏండ్ల వయసు ఉంటుందని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టామని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more