Nitin Gadkari hits out at those ‘distorting’ his speeches నా వ్యాఖ్యలు వక్రీకరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: గడ్కారీ

Gadkari s strong warning after not worried about my post speech goes viral

Nitin Gadkari, BJP, BJP Parliamentary Board, BJP Central Election Committee, Devendra Fadnavis, BJP, Union Minister Nitin Gadkari, Gadkari comment, Nitin Gadkari timely decision, Government decisions not in time, Maharashtra, Politics

Union minister Nitin Gadkari warned against “concocting” his statements at public programmes without context, saying he will not hesitate to take such persons to the law in the larger interest. In a series of tweets, Gadkari said that efforts were being made to continue the “fabricated campaign” against him for political mileage by “some section of mainstream media, social media and some persons in particular.”

నా వ్యాఖ్యలు వక్రీకరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ

Posted: 08/26/2022 01:44 PM IST
Gadkari s strong warning after not worried about my post speech goes viral

రాజకీయ ప్రయోజనాల కోసమే తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు. ‘తనను మంత్రి పదవి నుంచి తప్పించినా తనపై ఎలాంటి ప్రభావం ఉండబోదని’ గడ్కరీ అన్నట్లు ఓ వీడియో మీడియాలో వైరల్ అయింది. ఈనేపథ్యంలో ఈవీడియోపై నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ అవసరాల కోసం వాడుకుంటే అలాంటివారిపై న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోనని హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు.

తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేశారంటూ తాను మాట్లాడిన పూర్తి వీడియోను నితిన్ గడ్కరీ ట్వి్ట్టర్ లో పంచుకున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు తనపై నీచ ప్రచారాలకు తెరలేపారని.. కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు సామాజిక మాద్యమ వేదికల్లోనూ తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. ఇలాంటి మోసపూరిత ప్రచారాలను పెద్దగా పట్టించుకోనని.. ఇలాంటివి కొనసాగితే న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా, పీఎంవో కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన మాట్లాడిన అసలు వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ తన గతానుభవాల్ని పంచుకుంటూ ఓ గ్రామానికి రోడ్డు వేసే సందర్భంగా అక్కడి అధికారులతో జరిగిన సంభాషణను గడ్కరీ ప్రస్తావించారు. జరుగుతున్న పర్యవసానాల గురించి నేను బాధపడను, కానీ నేను ఈపనిచేస్తాను.. వీలైతే తనకు అండగా నిలబడండి అని అధికారులతో గడ్కరీ అన్నారు. ఈ ఒక్క వాక్యాన్ని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించినందుకే గడ్కరీ ఈవ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రస్తావించారు. ఈ ప్రచారంపై స్పందించారు. అసత్య ప్రచారాలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles